ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా చాలా అభివృద్ధి చెందింది. మంచితో పాటు చెడు కూడా బాగా వైరల్ అవుతోంది. ఇక కేవలం డబ్బులు కోసం కొన్ని వెబ్ సైట్స్ బ్రతికి ఉన్న నటీనటులను కూడా చనిపోయారంటూ వార్తలు పుట్టిస్తున్నారు. ఇది ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఇక ఈ తప్పుడు వార్తల వల్ల ఆయా నటీనటులు తమ ఫ్యాన్స్ కంగారు పడకుండా మేము బాగానే ఉన్నామని బయటకొచ్చి చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు పలువురు ఇలాంటి వార్తలపై పోలీసులుకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ అవి మాత్రం ఆగట్లేదు.
తాజాగా ప్రముఖ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తనకేమి కాలేదని, బాగానే ఉన్నానని.. ఇలాంటి వార్తలు నమ్మొద్దని అభిమానులకు, ప్రేక్షకులకు తెలిపారు. కాగా సైబర్ పోలీసులు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించే వెబ్ సైట్స్ మీద నిఘా పెంచితే మంచిదని అభిమానులు కోరుకుంటున్నారు.
Don’t believe it, It’s a fake news I’m absolutely fine and please don’t trust these articles. pic.twitter.com/pdU9hDVEEY
— Sunil (@Mee_Sunil) March 15, 2019