Esha Deol: సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్‌లు, క్రికెటర్లు ఇలా చాలామంది సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన విషయాలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాద్యమాలలో పోస్ట్‌చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. అయితే వారిని కొంతమంది హ్యాకర్లు టార్గెట్ చేసి వారి అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. వారి పర్సనల్ లైఫ్‌ని ఇబ్బందుల్లోకి నెట్టుతున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా చాలమంది సెలబ్రిటీలు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.
తాజాగా బాలీవుడ్ నటి ఇషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. దీంతో వెంటనే తన ఫాలోవర్స్‌కు ఇషా హెచ్చరికలు జారీ చేసింది. నా ప్రొఫైల్ నుంచి ఎలాంటి మెసేజ్‌లు, పోస్ట్‌లు వచ్చిన స్పందించొద్దు అని అప్రమత్తం చేసింది. అంతేకాక తన ట్విట్టర్‌లో పలు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది. ఇటీవలి కాలంలో ఆషా బోస్లే, ఊర్మిళ మటోండ్కర్, సుషానే ఖాన్, విక్రాంత్ మస్సే, ఫరాఖాన్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా హ్యాక్ అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైతే అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలని ఇషా డియోల్ సూచించింది.
బిజినెస్‌లోకి చేరిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా.. ‘ఎడ్ ఏ మమ్మా’ పేరుతో కిడ్స్ క్లాత్ స్టోర్ ప్రారంభం..
Ameesha Patel : హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. పోలీసులను ఆశ్రయించిన బ్యూటీ