
అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ ఉన్మాది క్లాస్ రూంలోకి చొరబడి రంపంతో విద్యార్థినిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలు కాగా.. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. ఈ దాడి ఘటనపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే దీనిపై టాలీవుడ్ దర్శకుడు వేణు ఊడుగుల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అయితే ఈ ఘటనలో అమ్మాయి మరణించిందని సోషల్ మీడియాలో కథనాలు రావడంపై స్పందించిన దర్శకుడు.. అనంతరం.. ఆ బాలిక ప్రస్తుతం చికిత్స తీసుకుంటుందని ఓ నెటిజన్ క్లారిటీ ఇవ్వడంతో తన పాత పోస్టుకు రీట్వీట్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
“14 ఏళ్ల వయసు. ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, తనకంటూ ఒక భవిష్యత్తును ఊహించుకోవాల్సిన వయసు. తనను కాదన్నందుకు ఒక యువకుడు ఆమెను హత్య చేశాడు. ఇది కేవలం తిరస్కరణను తట్టుకోలేని మనస్తత్వం కాదు. ఎదుటి మనిషి తన ఇష్టానికి అనుగుణంగా జీవించాలనుకునే ఆధిపత్యమే. ఆ బాలిక బతికే హక్కుని లాక్కోవడమనేది ఆ ఆధిపత్యం యొక్క క్రూరమైన రూపం. ఆమె చూడాల్సిన ప్రపంచమంతా, కనాల్సిన కలలన్నీ ఆమెతో పాటే ఆగిపోయాయి.ఇంతకంటే విషాదం ఏముంటుంది” అంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ వేణు ఊడుగుల.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
అయితే వేణు ఊడుగుల ట్వీట్ పై నెటిజన్ రియాక్ట్ అవుతూ.. ఆ చిన్నారి బతికే ఉందని.. ప్రస్తుతం తనకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. “సార్, మీరు చెప్పిన ఆధిపత్య మనస్తత్వం గురించిన విశ్లేషణ పూర్తిగా నిజం. “నన్ను కాదంటే నీకు బతికే హక్కు లేదు” అనేది ప్రేమ కాదు, యాజమాన్యం. కానీ ఒక సవరణ. ఆ చిన్నారి ఇంకా బతికే ఉంది. ఆమె మృతి చెందిందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. ఆమె కలలు ఇంకా ఆగిపోలేదు, ఆగిపోకూడదు. “విరాటపర్వం”లో ప్రేమను ఆరాధనగా చూపించిన మీకు ఇది బాగా తెలుసు. “కాదు” అనే మాటను గౌరవించడం మన సినిమాలు ఎంతవరకు నేర్పిస్తున్నాయి? “అమ్మాయి కాదంటే వెంటపడి ఒప్పించడమే హీరోయిజం” అనే కథలు దీనికి ఎంతవరకు కారణం ? ఒక ఫిల్మ్‌మేకర్‌గా మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం “అంటూ నెటిజన్ ట్వీట్ చేశారు.
అయితే దీనికి డైరెక్టర్ వేణు ఊడుగుల రియాక్ట్ అవుతూ.. “ఆమె బతికే ఉంటే అంతకన్నా సంతోషం లేదు. అప్పటికే వచ్చిన వార్త ఆధారంగా రాశాను. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తాను. ఒక నేరం జరిగినప్పుడు, ఆ నేరానికి సినిమా మాత్రమే కారణమని నిందిస్తే, చర్చ నేరస్థుడి క్రూరత్వం నుంచి పక్కదారి పడుతుంది. అన్నింటికంటే ముఖ్యం, చేసిన నేరానికి బాధ్యుడు నేరస్థుడే. అయితే, హీరో అమ్మాయి వెంటపడటాన్ని ప్రేమగా, ఆమె “కాదు” అన్నా వెంటపడటాన్ని హీరోయిజంగా చూపించే సినిమాలు ఆ ప్రవర్తనను నార్మలైజ్ చేశాయి. ఈ ప్రభావాన్ని కొట్టిపారేయలేం. కోట్లాది మందికి చేరే సినిమాకు సామాజిక బాధ్యత కచ్చితంగా ఉంటుంది” అంటూ రీపోస్ట్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..