
క్రిష్ దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండు పార్టులుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ గురించి మనం పక్కన పెడితే.. మొదట ఈ బయోపిక్‌కి తేజ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ అనుకోని విధంగా ఆయన స్థానాన్ని క్రిష్ భర్తీ చేశాడు. అయితే తేజ ఈ బయోపిక్ నుంచి వైదొలగడంపై అప్పట్లో చాలానే కామెంట్స్ వినిపించాయి. తేజకి, బాలయ్యతో విభేదాలు వచ్చాయని.. అందుకే క్రిష్‌ను దర్శకుడిగా రీప్లేస్ చేశారని వార్తలు వచ్చాయి. అసలు ఈ విషయంపై అప్పట్లో ఎవరూ కూడా నోరు మెదపలేదు. దాంతో విభేదాలే కారణమై ఉండవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఇక ఈ విషయాలపై దర్శకుడు తేజ రీసెంట్ గా టీవీ9 ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తననెవరూ తీసేయలేదని.. తానుగానే తప్పుకున్నానని తేజ చెప్పుకొచ్చారు. అన్నగారి బయోపిక్ కు తాను సరిగ్గా న్యాయం చేయలేననిపించింది. అంతేకాకుండా ఆయన లైఫ్ ను సినిమాగా తీసేంత ట్యాలెంట్ తనకు లేదని అన్నారు. బాలకృష్ణతో తనకెలాంటి విభేదాలు లేవని.. సినిమాకు న్యాయం చేయలేననిపించే తప్పుకున్నానని తేజ పేర్కొన్నారు.ఇలా పలు అంశాలపై ఆయన స్పందించారు.