Vijay: తెలుగొస్తే చాలు.. రౌడీ హీరోతో నటించే ఛాన్స్‌. పూర్తి వివరాలు..

అనంతరం గీత గోవిందం, ట్యాక్సీవాలా వంటి విజయాలను సొంతం చేసుకున్న విజయ్‌కి మళ్లీ సరైన విజయం లభించలేదు. లైగర్‌, ఫ్యామిలీ స్టార్‌ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఎలాగైనా సక్సెస్ ట్రాక్‌ ఎక్కాలని ఆశతో ఉన్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే జెర్సీ ద‌ర్శ‌కుడు...

Vijay: తెలుగొస్తే చాలు.. రౌడీ హీరోతో నటించే ఛాన్స్‌. పూర్తి వివరాలు..
Vijay Devarakonda

Updated on: Jun 20, 2024 | 7:03 AM

ఎవడే సుబ్రమణ్యంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ‘పెళ్లి చూపులు’ మూవీతో తొలి విజయాన్ని అందుకొని ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ. ఇక అనంతరం సందీప్‌ వంగ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. ఈ సినిమా విజయంతో టాలీవుడ్‌లో అగ్ర స్థానంలో ఒకరిగా నిలిచాడు విజయ్‌.

అనంతరం గీత గోవిందం, ట్యాక్సీవాలా వంటి విజయాలను సొంతం చేసుకున్న విజయ్‌కి మళ్లీ సరైన విజయం లభించలేదు. లైగర్‌, ఫ్యామిలీ స్టార్‌ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఎలాగైనా సక్సెస్ ట్రాక్‌ ఎక్కాలని ఆశతో ఉన్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే జెర్సీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరితో సినిమా ఒక సినిమా చేస్తున్న విజ‌య్.. ఈ సినిమా అనంత‌రం దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఒక సినిమా చేయ‌బోతున్నాడు.

SVC59 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈసినిమాలో క్యాస్టింగ్ కాల్‌కు చిత్ర యూనిట్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకోండని దర్శకుడు స్వయంగా ట్వీట్‌ చేశాడు. ఆసక్తి ఉన్న వారు తమ ప్రొఫైల్‌ పంపించాలని కోరాడు.

ఈ విషయమై ఆయన ట్వీట్‌ చేస్తూ.. యాక్టింగ్ వ‌స్తే చాలు. తెలుగొస్తే సంతోషం…గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు అంటూ రవి కిర‌ణ్ తెలిపాడు. న‌ట‌న అంటే ఇష్టం ఉన్నవారు ఈ ద‌ర‌ఖాస్తుకు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. ఈ సినిమాకు అన్ని వయస్సుల వారు అర్హులే. మీ ప్రొఫైల్స్ ని SVC59casting@gmail.com మెయిల్‌కు లేదా వాట్సాప్ అయితే 9676843362 అనే నంబ‌ర్‌కు పంప‌గ‌ల‌రు అని ద‌ర్శ‌కుడు తెలిపాడు. అలాగే ఇన్‌స్టా రీల్స్, సెల్ఫీ వీడియోలు పంప‌వ‌ద్ద‌ని తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా గోదారి బ్యాక్‌డ్రాప్‌లో రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా విజయ్‌తో కలిసి నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..