తీవ్ర అస్వస్థతకు గురైన కోడి రామకృష్ణ

టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందుతోందని తెలుస్తోంది. గతంలో పెరాలసిస్‌తో బాధపడ్డ కోడి రామకృష్ణ మళ్లీ కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా చిరంజీవి నటించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన కోడి రామకృష్ణ తెలుగు, తమిళ, […]

తీవ్ర అస్వస్థతకు గురైన కోడి రామకృష్ణ

Edited By:

Updated on: Feb 21, 2019 | 2:00 PM

టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందుతోందని తెలుస్తోంది. గతంలో పెరాలసిస్‌తో బాధపడ్డ కోడి రామకృష్ణ మళ్లీ కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కాగా చిరంజీవి నటించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన కోడి రామకృష్ణ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో వంద చిత్రాలను తెరకెక్కించారు. ఐదు చిత్రాల్లో నటుడిగా చేశారు. కేవలం కుటుంబ కథా చిత్రాలనే కాకుండా పలు మాస్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ముఖ్యంగా ఫాంటసీ చిత్రాలలో తనదైన ముద్రను వేశాడు కోడి రామకృష్ణ.