సోదరులు చనిపోయారని ఇంకా దిలీప్‌ కుమార్‌కి తెలీదట

కరోనా బారిన పడి బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ సోదరులు అస్లాం ఖాన్‌, ఇషాన్ ఖాన్ మరణించిన విషయం తెలిసిందే.

సోదరులు చనిపోయారని ఇంకా దిలీప్‌ కుమార్‌కి తెలీదట

Updated on: Sep 04, 2020 | 2:48 PM

Saira Banu Dilip Kumar: కరోనా బారిన పడి బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ సోదరులు అస్లాం ఖాన్‌, ఇషాన్ ఖాన్ మరణించిన విషయం తెలిసిందే. కరోనాకు చికిత్స పొందుతూ గత నెల 21న అస్లాం ఖాన్ మరణించగా.. గురువారం ఇషాన్ ఖాన్ తుదిశ్వాస విడిచారు. అయితే ఈ ఇద్దరు చనిపోయిన విషయం ఇంకా దిలీప్ కుమార్‌కి తెలీదట. ఈ విషయాన్ని ఆయన భార్య సైరా భాను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

”నిజానికి చెప్పాలంటే.. తన సోదరులు లేరన్న విషయం ఇంకా దిలీప్‌ కుమార్‌కి చెప్పలేదు. ఆయనను ఇబ్బంది పెట్టే విషయాలను మేము దూరంగా ఉంచుతున్నాము. అలాగే అమితాబ్‌ కరోనా బారిన పడ్డారన్న విషయాన్ని కూడా దిలీప్‌కి చెప్పలేదు. ఎందుకంటే బిగ్‌బీ అంటే దిలీప్‌కి చాలా ఇష్టం. అందుకే ఈ విషయాన్ని మేము తెలియనివ్వలేదు” అని సైరా చెప్పుకొచ్చారు. ఇక దిలీప్ కుమార్ ఆరోగ్యంపై కూడా ఆమె స్పందిస్తూ.. ”ప్రస్తుతం ఆయన నిలకడగా ఉన్నారు. ఇంట్లో నుంచి ఎక్కడికీ కదలనివ్వడం లేదు. అయితే డీహైడ్రేషన్ వలన ఆయన బీపీలో కాస్త మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అందుకు చికిత్స ఇప్పిస్తున్నాం” అని వివరించారు.

Read More:

అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

ప్రభాస్ మూవీకి అడ్వాన్స్‌ తీసుకోని దీపిక.. ఏం జరుగుతోంది..!

Loading...
Unable to load recommendations.
Follow Us