సినీ పరిశ్రమలో మార్పు రావాలి.. పవన్‌ నాకు ఆదర్శం! దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ లో మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమలో మార్పుల అవసరం, టికెట్ ధరలు, హీరోల రెమ్యునరేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సలహాలను అనుసరించి టికెట్ ధరలు పెంచకూడదని, ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడం నిర్మాతల బాధ్యత అని పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలో మార్పు రావాలి.. పవన్‌ నాకు ఆదర్శం!  దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Dil Raju

Updated on: Jun 11, 2025 | 10:24 PM

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మార్పు రావాలని అన్నారు. నితిన్‌ హీరో నటిస్తున్న తమ్ముడు సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరైన దిల్‌ రాజు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్‌ ధరలపై కూడా ఆయన స్పందించారు. దిల్‌ రాజు మాట్లాడుతూ.. “నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను. తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగను. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు ఆదర్శం. నేను పవన్ కళ్యాణ్ సూచనలను అనుసరిస్తా. పవన్ కళ్యాణ్ సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలి.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదు. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించాం. పవన్ కళ్యాణ్ సూచనలపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చాను. హీరోలు రెమ్యునరేషన్ల విషయంలో పునరాలోచించుకోవాలి. తమ్ముడు చిత్రానికి హీరో నితిన్, దర్శకుడు వేణు నాకు సహకరించారు. సక్సెస్ వచ్చినప్పుడు అందరి రెమ్యునరేషన్లు పెరుగుతాయి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు” అని దిల్‌ రాజ్‌ అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి