Boney Kapoor: 70 ఏళ్ల వయసులో 26 కేజీలు తగ్గిన బాలీవుడ్ ప్రొడ్యూసర్.. డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి భర్తగా, అందాల తార జాన్వీ కపూర్ తండ్రిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఎప్పుడూ లావుగా కనిపించే బోనీ కపూర్ ప్రస్తుతం సన్నగా మారి బాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.70 ఏళ్ల వయసులో ఆయన ఏకంగా 26 కేజీలు తగ్గారు. మరి ఆయన ఎలా బరువు తగ్గారో.. డైట్ సీక్రెట్ ఏంటో ఇక్కడ చూద్దాం..

Boney Kapoor: 70 ఏళ్ల వయసులో 26 కేజీలు తగ్గిన బాలీవుడ్ ప్రొడ్యూసర్.. డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Boney Kapoor

Updated on: Nov 17, 2025 | 12:01 PM

Boney Kapoor: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి భర్తగా, అందాల తార జాన్వీ కపూర్ తండ్రిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఎప్పుడూ లావుగా కనిపించే బోనీ కపూర్ ప్రస్తుతం సన్నగా మారి బాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. నవంబర్ 11వ తేదీన 70వ పుట్టినరోజు జరుపుకున్న ఈ బాలీవుడ్ ప్రొడ్యూసర్, జిమ్, కష్టమైన ఎక్సర్‌‌సైజులు లేకుండా బరువు తగ్గారు. బొద్దుగా ఉండే బోనీ బరువు తగ్గిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అంత సన్నగా ఎలా అయ్యారని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన జర్నీ అన్ స్క్రిప్టెడ్ విత్ చందా కొచ్చర్ ఇంటర్వ్యూకు హాజరైన బోనీ కపూర్ బరువు ఎలా తగ్గారనే ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.

మోనా శౌరీ, శ్రీదేవిని పెళ్లి చేసుకున్న బోనీకి అర్జున్, అన్షుల, జాన్వి, ఖుషీ కపూర్ నలుగురు పిల్లలు. “నా పిల్లలు తమ లక్ష్యాలను చేరుకునేంత వరకు నేను ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను. నాకు సంకల్ప బలం చాలా ఎక్కువ. మరో 3 కిలోలు తగ్గడానికి కట్టుబడి ఉన్నాను. ప్రస్తుతం 87 నుంచి 88 కిలోల వరకు బరువు ఉన్నాను. 85 కిలోల వరకు తగ్గుతాను. 114 కిలోల బరువు ఉండే నేను దాదాపుగా 26 కిలోలు తగ్గాను.” అని చెప్పుకొచ్చారు.

Boney Kapoor

బోనీ కపూర్ డైట్ సీక్రెట్ ఇదే..

బరువు తగ్గాలనే సంకల్పం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కారణమని తెలిపారు బోనీ.  నేను 114 కిలోల వరకు బరువు పెరిగాను. ఇప్పుడు 26 కిలోలు తగ్గాను. కేవలం డైట్ కంట్రోల్‌తోనే ఇది సాధ్యమైంది. నా ఆహారపు అలవాట్లను నియంత్రించుకున్నాను. జ్యూస్‌లు తాగుతాను. ఆమ్లా, కివి, పలు రకాల పండ్లు తింటాను. రెండు గుడ్లలో వైట్‌తో చేసిన ఆమ్లెట్ తీసుకుంటాను. అదే నా బ్రేక్ ఫాస్ట్. మధ్యాహ్నం భోజనానికి.. కొన్నిసార్లు సూప్ తాగుతాను. లేదంటే పప్పు, సబ్జీతో చేసిన జొన్న రొట్టె మాత్రమే తింటాను. ఇంకా ఆకలిగా అనిపిస్తే చిక్‌పా పిండితో చేసిన చీలా తీసుకుంటాను. రాత్రి భోజనంలో రెండు గ్లాసుల సూప్‌తోపాటు తందూరి చికెన్ తింటాను. ఇదే నా రోజు వారి డైట్. ప్రతివారం కనీసం రెండు చీట్ డేస్ ఉంటాయి’ అని తన రోజువారీ డైట్‌ సీక్రెట్‌ తెలిపారు బోనీ.