రజనీకాంత్ పాటతో జిమ్‌లో వర్కౌట్లు చేస్తోన్న ధనుష్, సారా అలీ ఖాన్.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. మూడోసారి బాలీవుడ్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆనంద్‌రాయ్ తెరకెక్కిస్తోన్న 'అంతరంగి రే' అనే మూవీలో ధనుష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Dhanush Sara workout: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. మూడోసారి బాలీవుడ్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆనంద్‌రాయ్ తెరకెక్కిస్తోన్న ‘అంతరంగి రే’ అనే మూవీలో ధనుష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మధురైలో జరగుతుంది. కాగా ఈ చిత్రం కోసం ధనుష్‌తో కలిసి సారా అలీ ఖాన్ జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నారు. ఈ వీడియోను సారా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దానికి ట్రైనింగ్ విత్ తలైవా అని ఆమె కామెంట్ పెట్టారు. ఇక వీరు జిమ్ చేస్తోన్న సమయంలో వెనకాల సూపర్‌స్టార్ రజనీకాంత్ పెట్టాలోని.. మరనా.. మాస్ మరనా పాట ప్లే అవుతోంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అటు ధనుష్, ఇటు సారా అభిమానులను ఆకట్టుకుంటోంది.
Dhanush & sara Ali Khan workout ?? #dhanush #SaraAliKhan pic.twitter.com/K3bJvtBKbF
— JD (@mastervijay2020) November 28, 2020