‘మ్యూజికల్ మెలోడీస్‌’కి రెడీ అవ్వండన్న రాక్‌స్టార్..!

| Edited By:

Nov 02, 2020 | 8:57 AM

లాక్‌డౌన్ సడలింపులతో మెల్లమెల్లగా సినిమా పరిశ్రమ తమ పనులను ప్రారంభించింది. ఓ వైపు షూటింగ్‌లు స్టార్ట్ అయిపోయాయి.

మ్యూజికల్ మెలోడీస్‌కి రెడీ అవ్వండన్న రాక్‌స్టార్..!
Follow us on

Devi Sri Prasad: లాక్‌డౌన్ సడలింపులతో మెల్లమెల్లగా సినిమా పరిశ్రమ తమ పనులను ప్రారంభించింది. ఓ వైపు షూటింగ్‌లు స్టార్ట్ అయిపోయాయి. మరోవైపు థియేటర్లు తెరుచుకోవచ్చునంటూ గత నెలలోనే కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఓటీటీలో కాకుండా థియేటర్లలో మూవీలు విడుదల చేసేందుకు దర్శకనిర్మాతల సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వాటికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ఫ్యాన్స్‌కి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ గుడ్‌న్యూస్ చెప్పారు. మ్యూజికల్‌ మెలోడీస్‌కి రెడీగా ఉండండి అని ఆయన ట్వీట్ చేశారు. ( వరలక్ష్మిపై క్షుద్ర పూజలు చేశారా..!)

ప్రస్తుతం దేవీ చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉండగా.. అందులో రంగ్‌దే, ఉప్పెన సినిమాల నుంచి పాటలను విడుదల చేయబోతున్నట్లు దేవీ వివరించారు. కాగా ఉప్పెన నుంచి ఇప్పటికే వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక మిగిలిన పాటలు కూడా అంతకుమించిన రేంజ్‌లో ఉండబోతున్నాయని ఇప్పటికే సమాచారం అందుతోంది. అలాగే రంగ్‌దే మూవీ ఆల్బమ్‌పై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. మరి ఈసారి సంగీత ప్రియులను దేవీ ఏ మేరకు అలరించనున్నారో తెలియాలంటే పాటలు వచ్చే వరకు ఆగాల్సిందే. ( Bigg Boss 4: మోనాల్‌కి అభిజిత్‌ భరోసా)