Wendell Rodricks: ఆయన లేని లోటు తీరనిది.. భావోద్వేగంలో బాలీవుడ్..!

Wendell Rodricks: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, పద్మశ్రీ వెండెల్ రాడ్రిక్స్(59) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గోవాలోని తన నివాసంలో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వెండెల్ మరణంపై ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు. అయితే గోవాకు చెందిన వెండెల్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో తనదైన ముద్రను […]

Wendell Rodricks: ఆయన లేని లోటు తీరనిది.. భావోద్వేగంలో బాలీవుడ్..!

Edited By:

Updated on: Feb 13, 2020 | 6:10 PM

Wendell Rodricks: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, పద్మశ్రీ వెండెల్ రాడ్రిక్స్(59) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గోవాలోని తన నివాసంలో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వెండెల్ మరణంపై ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు.

అయితే గోవాకు చెందిన వెండెల్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో తనదైన ముద్రను వేసుకున్నారు. అంతేకాదు పర్యావరణవేత్తగా, గేహక్కుల కోసం పోరాడిన సామాజిక కార్యకర్తగా ఆయనకు మంచి పేరుంది. కొన్ని సినిమాల్లోనూ ఆయన గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా భారతీయ ఫ్యాషన్‌కు అనుగుణంగా రిస్టార్ట్ వేర్, ఎకో ఫ్రెండ్లీ డిజైన్లను ఆయన వస్త్ర ప్రపంచంలోకి తీసుకొచ్చారు. పలు షోల్లో పాల్గొన్న ఆయన.. ఖాదీ ఉపయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. ఇక ఫ్యాషన్ డిజైనింగ్‌కు సంబంధించి ఓ మ్యూజియాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోన్న సమయంలో ఆయన కన్నుమూయడం బాధాకరం. మరికాసేపట్లో ఆయన అంత్యక్రియలు ముగియనున్నాయి.