Deepika Padukone: ఏడేళ్ల డేటింగ్ తర్వాత అతడిని పెళ్లి చేసుకున్నా.. అసలు నిజాలను చెబుతున్న బాలీవుడ్ బ్యూటీ..

|

Feb 01, 2021 | 5:38 AM

Deepika Padukone: సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్‌లీలా’ చిత్రం ద్వారా తొలిసారి జంటకట్టింది ఆ జోడి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే

Deepika Padukone: ఏడేళ్ల డేటింగ్ తర్వాత అతడిని పెళ్లి చేసుకున్నా.. అసలు నిజాలను చెబుతున్న బాలీవుడ్ బ్యూటీ..
Follow us on

Deepika Padukone: సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్‌లీలా’ చిత్రం ద్వారా తొలిసారి జంటకట్టింది ఆ జోడి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే కొనసాగారు. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వారెవరో కాదు రణ్‌వీర్‌-దీపిక దంపతులు. ఏడేళ్ల డేటింగ్‌ తర్వాత ఈ జంట 2018లో నవంబర్‌ 14న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే రణ్‌వీర్‌ కపూర్‌ను వివాహం చేసుకోడానికి గల కారణం గురించి ఇటీవల దీపికాపదుకొణె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఫేమ్‌, సంపాదనపరంగా రణ్‌వీర్‌ కంటే తాను ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ అతను మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండేవాడని, ఒకేవిధంగా గౌరవించేవాడని, అదే ఏడడుగుల బంధంలోకి వెళ్లేలా చేసిందని పేర్కొంది. మొదటి నుంచి తన విజయాన్ని, సంపాదనను రణ్‌వీర్‌ ఎంతో గౌరవించాడని, ఇప్పుడు తాను కూడా స్టార్‌డమ్‌, ఫేమ్‌ పొందుతున్నాడని, కానీ ఏడేళ్ల క్రితం ఇవేమీ లేవని చెప్పింది. అతను పరిచయమయ్యే సమయానికి తాను సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా ఉన్నానని, వరుస సినిమా షూట్స్‌తో చాలా బిజీగా గడిపేదానినని, కొన్నిసార్లు ఇంటికి కూడా వచ్చేదాన్ని కాదని చెప్పింది. అయితే వరుస సినిమాల వల్ల తన సంపాదన కూడా ఎక్కువగానే ఉండేదని కానీ మా ఇద్దరి మధ్య ఈ విషయాలేవీ చర్చకు వచ్చేవి కాదని పేర్కొంది. తను అంతలా గౌరవించాడు కనుకే మా బంధం మరింత బలపడిందని చెబుతుంది ఈ సొట్టబుగ్గల సుందరి.

ఆ ఊర్లో ఒక్కరికి తప్ప అందరికీ కరోనా పాజిటివ్, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫలితం ఇదే