ఆ ఊర్లో ఒక్కరికి తప్ప అందరికీ కరోనా పాజిటివ్, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫలితం ఇదే

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా విస్తరిస్తోందో..ఇప్పడు చెప్పబోయే ఉదంతం ద్వారా స్పష్టంగా మీకు అర్థమవుతుంది.

  • Ram Naramaneni
  • Publish Date - 3:53 pm, Fri, 20 November 20

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా విస్తరిస్తోందో..ఇప్పడు చెప్పబోయే ఉదంతం ద్వారా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని లహౌల్ లోయలో ఉన్న థొరాంగ్ అనే ఓ చిన్న ఊరులో ఒక్కరు తప్ప మిగిలిన ప్రజలందరూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు. అవును ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. ఇటీవల గ్రామంలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో స్థానికులు  పాల్గొనడంతో అందరికీ వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదే గ్రామంలో నివశిస్తోన్న  52 ఏళ్ల వ్యక్తి భూషణ్ ఠాకూర్ తప్ప మిగతా అందరికీ వైరస్ సోకింది. ఆ ఊర్లోని మొత్తం 42 మందికి పరీక్షలు చేయగా… 41 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు నెగటివ్ రావడంతో ఒక్కడినే వేరే గదిలో ఉంటూ వంట  చేసుకుంటున్నానని  భూషణ్ ఠాకూర్‌ చెప్పారు. ఈ గ్రామంలోని చాలా మంది చలికాలం కారణంగా కులూకి వెళ్లిపోయారని..లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని అధికారులు చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో లహౌల్‌-స్పిటి జిల్లాలోనే భారీగా కోవిడ్ కేసులు నమోదయ్యాడు. దీంతో ఈ జిల్లాలో టూరిస్టులను అనుమతించడం లేదు.

Entire village in Lahaul tests Covid positive | India News

Also Read :

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..