శ్రీదేవి.. అతిలోకసుందరిగా.. తెలుగు చిత్ర సీమతో పాటు అటు బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంది. బాల నటిగా.. సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. అతి తక్కువ కాలంలోనే.. తన టాలెంట్‌తో.. బాలీవుడ్‌కి వెళ్లగలిగింది. ఇప్పటికి శ్రీదేవి మరణించి ఏడాదిన్నర గడుస్తున్నా.. ఆమె ఇంకా మన మధ్యే ఉన్నట్టుగా ఉంది. తాజాగా.. ఆమె జీవిత చరిత్రపై.. ‘శ్రీదేవి.. ది ఎటర్నల్ స్ర్కీన్ గాడెస్’ పేరుతో ఓ బుక్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ పుస్తకాన్ని సత్యార్థి నాయక్ రచించారు. అంతేకాకుండా.. ఈ బుక్‌లోని కొన్ని మొదటి లైన్స్.. కాజోల్ చెప్పారు. ఆమె ఓ గొప్ప నటి అని.. నటనకు ఆమె ఓ డిక్షనరీ అని పేర్కొంది కాజోల్.
కాగా.. ఈ కార్యక్రమంలో.. శ్రీదేవి భర్త బోనీకపూర్, హీరోయిన్ దీపికా పదుకొనె, తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారిగా.. ఆమెను తలుచుకొని అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ కంటతడి పెట్టుకున్నారు. పక్కనే ఉన్న దీపిక ఆయన్ని ఓదార్చారు. శ్రీదేవి ఓ గొప్పనటి మాత్రమే కాదని.. తను ఓ అద్భుతమైన వ్యక్తి అని దీపిక కొనియాడారు. ఆమె జీవిత చరిత్రను నా చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీదేవి 2018, ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లో బాత్ టబ్‌లో పడి మరణించారు.