‘డియర్ కామ్రేడ్’కి ఇంకా టైముంది..!

|

Apr 23, 2019 | 2:07 PM

విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమాకి భరత్ కమ్మ దర్శకుడు. కాగా ఈ చిత్రం మే 31న విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడినట్లు తెలుస్తోంది. తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘ఎన్జీకే’ చిత్రం అదే రోజున రిలీజ్ కానుంది. కాబట్టి చిత్ర నిర్మాతలు ‘డియర్ కామ్రేడ్’ సినిమాని వాయిదా వేశారని వినికిడి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ […]

డియర్ కామ్రేడ్కి ఇంకా టైముంది..!
Follow us on

విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమాకి భరత్ కమ్మ దర్శకుడు. కాగా ఈ చిత్రం మే 31న విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడినట్లు తెలుస్తోంది. తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘ఎన్జీకే’ చిత్రం అదే రోజున రిలీజ్ కానుంది. కాబట్టి చిత్ర నిర్మాతలు ‘డియర్ కామ్రేడ్’ సినిమాని వాయిదా వేశారని వినికిడి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూలై 19న రిలీజ్ చేస్తారట. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.