హీరో రాజశేఖర్‌కు షాక్.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు

| Edited By: Pardhasaradhi Peri

Nov 29, 2019 | 11:40 AM

ప్రముఖ నటుడు రాజశేఖర్‌కు ఆర్టీఏ షాక్ ఇవ్వనుంది. తరచుగా రాజశేఖర్ ఏదో ఒక ప్రమాదానికి కారణమవుతుండగా.. ఆయన లైసెన్సును రద్దు చేయాల్సిందిగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆర్టీఏకు వారు ఓ లేఖను పంపారు. రాజశేఖర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో మరికొన్ని రోజుల్లో ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కనీసం ఆరు […]

హీరో రాజశేఖర్‌కు షాక్.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు
Follow us on

ప్రముఖ నటుడు రాజశేఖర్‌కు ఆర్టీఏ షాక్ ఇవ్వనుంది. తరచుగా రాజశేఖర్ ఏదో ఒక ప్రమాదానికి కారణమవుతుండగా.. ఆయన లైసెన్సును రద్దు చేయాల్సిందిగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆర్టీఏకు వారు ఓ లేఖను పంపారు. రాజశేఖర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో మరికొన్ని రోజుల్లో ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కనీసం ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఇటీవల హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డుపై పరిమితికి మించిన వేగంతో కారు నడిపాడు రాజశేఖర్. దీంతో ఆయన కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది. అదృష్టం బావుండటంతో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇక 2017లోనూ ఆయన కారు ప్రమాదానికి గురయ్యారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఆయన ప్రయాణిస్తోన్న కారు మరో కారును ఢీకొట్టిన విషయం తెలిసిందే.