కీర్తిని ‘క్రాక్ పిల్ల’ అన్న ‘మహానటి’ నిర్మాత

కీర్తి సురేష్‌ కెరీర్‌లో గుర్తిండిపోయే చిత్రాల్లో మహానటి కచ్చితంగా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఇక ఆ సినిమాతో ఆమెకు వచ్చిన గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కీర్తిని క్రాక్ పిల్ల అన్న మహానటి నిర్మాత

Updated on: Jul 26, 2020 | 2:03 PM

Swapna Dutt on Keerthy Suresh: కీర్తి సురేష్‌ కెరీర్‌లో గుర్తిండిపోయే చిత్రాల్లో మహానటి కచ్చితంగా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఇక ఆ సినిమాతో ఆమెకు వచ్చిన గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన స్వప్నా దత్‌, కీర్తిని క్రాక్ పిల్ల అని అనేసింది.

ఇటీవల తన ఇన్‌స్టాలో ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్ట్ చేసిన కీర్తి.. స్వప్నాదత్‌ని చూసిన సమయంలో ఎంత ఎగ్జైట్‌ అయ్యానో చూడండి. బహుషా నా చివరి చెల్లింపును ఇవ్వడం వలన కలిగిన ఆనందం అయ్యి ఉంటుంది అని కామెంట్ పెట్టారు. దానికి స్వప్నా దత్‌ స్పందిస్తూ.. ఈ క్రాక్ పిల్ల తన పారితోషికం కూడా అడగదు అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. రెమ్యునరేషన్‌ లేకుండానే కీర్తి, మహానటిలో నటించిందా..? అని ప్రశ్నిస్తున్నారు.  కాగా కీర్తి సురేష్‌ నటించిన మిస్ ఇండియా విడుదలకు సిద్ధంగా ఉండగా.. గుడ్‌ లక్ సఖి, రంగ్ దే, అన్నాత్తే, మరక్కర్‌ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే మహేష్ బాబు సరసన సర్కారు వారి పాటలో హీరోయిన్‌గా నటించనుంది.

Read This Story Also: మూడో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. తంజావూర్ సంప్రదాయన్న నటి

Loading...
Unable to load recommendations.
Follow Us