Tuck Jagadeesh : నాని చివరిగా నటించిన ‘వి’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన నాని. వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో నిన్ను కోరి సినిమాతో తనకుహిట్ ఇచ్చిన శివ నిర్వాణంతో సినిమా చేస్తున్నాడు నాని.
ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో రాబోతున్నాడు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, డానియల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్ ప్రధాన తారాగణం. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చాలా రోజుల కిందటే ప్రకటించారు. అయితే అదే రోజు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమా విడుదల కానుంది. శేఖర్ కమ్ముల సినిమా అంటే ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. పైగా సాయి పల్లవి దాంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో నాని సినిమా విడుదల తేదీని మార్చుకోవాలని చూస్తుందని తెలుస్తుంది. లవ్ స్టోరీ సినిమా తో పాటు.. పవర్ స్టార్ వకీల్ సాబ్ కూడా అదే సమయంలో రిలీజ్ కు రెడీ అవుతుంది. దాంతో నాని సినిమాను మార్చ్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ వార్తలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Balakrishna Movie Update: బాలయ్య కోసం రంగంలోకి ఇద్దరు విలన్లు.. బోయపాటి ప్లాన్ మాములుగా లేదుగా..