Vijay sethupathi: మక్కల్‌ సెల్వన్‌పై దాడి ఘటన.. హిందూ వాది అర్జున్‌ సంపత్‌పై కేసు నమోదు..

ఇటీవల ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. జాతీయ అవార్డును అందుకుని

Vijay sethupathi: మక్కల్‌ సెల్వన్‌పై దాడి ఘటన.. హిందూ వాది అర్జున్‌ సంపత్‌పై కేసు నమోదు..

Updated on: Nov 18, 2021 | 12:59 PM

ఇటీవల ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జాతీయ అవార్డును అందుకుని వెళుతున్న విజయ్ సేతుపతిపై బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ఓ అగంతకుడు దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సమయంలో విజయ్ సేతుపతిపై దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ హిందూ వాది అర్జున్ సంపత్ పేరిట మక్కల్ కట్చి సంస్థ పేరిట ట్వీట్ చేశారు. విజయ్ సేతుపతిపై దాడి చేసిన వారికి ఒక్కో దెబ్బకు రూ. 1001 బహుమతి ఇస్తామని అందులో ప్రకటించారు. కాగా బహిరంగంగా బెదిరింపులకు పాల్పడిన అర్జున్‌ సంపత్‌పై తాజాగా కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

పలు సెక్షన్లపై కేసులు నమోదు..
భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్‌ 504 (శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశ పూర్వకంగా అవమానించడం), సెక్షన్‌ 506(1) (క్రిమినల్‌ బెదిరింపులకు పాల్పడడం) కింద అర్జున్‌ సంపత్‌పై కేసులు నమోదు చేసినట్లు కోయంబత్తూరు పోలీసులు తెలిపారు. కాగా ప్రముఖ స్వాతంత్రోద్యమ వీరుడు అయ్య తేవర్‌ను విజయ్ సేతుపతి అవమానించాడని, అతను క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టమని గతంలో అర్జున్‌ ప్రకటించారు. అతను క్షమాపణలు చెప్పే వరకు.. ప్రతి తన్నుకు రూ.1001 రివార్డును అందజేస్తామని సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే..

Also Read:

Bhumika Chawla : తరగని అందం.. తిరుగులేని వయ్యారం అందాల భూమిక లేటెస్ట్ ఫొటోస్..

Krithi Shetty : అచ్చమైన పల్లె రాణిలా మెరిసిన ముద్దుగుమ్మ.. బంగార్రాజు నుంచి నాగలక్ష్మి లుక్ వచ్చేసింది..

Krithi Shetty Photos: కొంటె చూపులు.. చిలిపి నవ్వులు.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ ‘కృతిశెట్టి’.. (ఫొటోస్)