పవన్ ఈసారి కూడా పంపలేదు.. మిస్ అవుతున్నా..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, కమెడియన్‌ అలీల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు ఒకప్పుడు మంచి స్నేహితులు.

పవన్ ఈసారి కూడా పంపలేదు.. మిస్ అవుతున్నా..!

Edited By:

Updated on: Jun 01, 2020 | 8:53 PM

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, కమెడియన్‌ అలీల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు ఒకప్పుడు మంచి స్నేహితులు. తాను నటించే ప్రతి సినిమాలో అలీకి కచ్చితంగా ఒక పాత్రను ఇస్తూ వచ్చారు పవన్ కల్యాణ్(ఇంకా చెప్పాలంటే.. గోకులంలో సీత మొదలు కాటమరాయుడు వరకు పవన్ నటించిన ప్రతి చిత్రంలోనూ అలీ నటించారు). అలాంటిది వీరిద్దరి మధ్య రాజకీయాలు చిచ్చు పెట్టాయి. పవన్ జనసేన పార్టీని పెట్టగా, అలీ వైసీపీలోకి వెళ్లి ప్రచారం చేశారు.

ఇక గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్, అలీపై బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ విషయంలో అలీ కూడా నొచ్చుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య అంతరం మరింత పెరిగింది. ఆ తరువాత ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోలేదు. ఇక ప్రస్తుతం పవన్, వకీల్ సాబ్‌తో రీఎంట్రీ ఇస్తుండగా.. అందులో కూడా అలీకి అవకాశం ఇవ్వలేదు.

ఇదంతా పక్కనపెడితే ప్రతి సంవత్సరం పవన్ కల్యాణ్‌ తన ఫార్మ్‌ హౌస్‌లో పండించే మామిడి పండ్లను నితిన్, అలీ, బాబీ ఇలా పలువురు సినీ సెలబ్రిటీలకు పంపే విషయం తెలిసిందే. అందులో అలీ కూడా ఒకరు. అయితే గత రెండేళ్లుగా పవన్ నుంచి అలీకి మామిడి పండ్లు రావడం లేదట. ఈ విషయాన్ని అలీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గతేడాది రాజకీయాల్లో బిజీగా ఉండటం వలనో ఏమో పవన్‌ నుంచి మామిడి పండ్లు రాలేదు. ఈ సారి లాక్‌డౌన్ ఉంది. పవన్ మామిడి పండ్లను మిస్ అవుతున్నా. వచ్చే ఏడాది అయినా పవన్ నుంచి మామిడి పండ్లు వస్తాయని ఆశిస్తున్నా అని అలీ అన్నారు.

Read This Story Also: ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం.. ఇకపై సచివాలయాల్లోనూ ఇసుక బుకింగ్..!