
బాలీవుడ్‌లోని ఓ క్రిటిక్‌పై ప్రముఖ రచయిత, కాలమిస్ట్ చేతన్ భగత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ క్రిటిక్ తన కెరీర్‌ని నాశనం చేయాలనుకున్నాడని ఆయన ఆరోపించారు. అంతేకాదు అదే క్రిటిక్ సుశాంత్ కెరీర్‌ని తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడని చేతన్ భగత్ అన్నారు.
ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన చేతన్.. ”ఓ క్రిటిక్ నా కెరీర్‌ను నాశనం చేయాలనుకున్నాడు. అంతేకాదు నేను పనిచేసే ప్రతి విషయంలో ఇబ్బంది పెట్టాడు. సుశాంత్ కెరీర్‌ను ముంచేందుకు తనవంతు ప్రయత్నాలు చేశాడు. స్వంతంగా వచ్చిన వారు, ఇంగ్లీష్ సరిగా రాని వారు, చిన్న ప్రాంతాల నుంచి కాన్ఫిడెంట్‌తో వచ్చే వారంటే అతడికి అస్సలు నచ్చదు. స్టార్ హీరోలు దయచేసి అతడిపై జాలిని చూపకండి” అంటూ కామెంట్ పెట్టారు. కాగా గత నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. అయితే అతడు ఈ నిర్ణయం తీసుకోవడానికి బాలీవుడ్‌లోని పెద్దలే కారణమంటూ ఫ్యాన్స్‌తో పాటు పలువురు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
There is one critic who tried to destroy my career and spew venom on everything I'm associated with. He also tried his best to sink Sushant. His main hates a)self made people b) less anglicized more desi people and c)confident small town Indians. I beg stars not to patronize him.
— Chetan Bhagat (@chetan_bhagat) July 21, 2020