Celebrity Cricket League 2023: ఎప్పుడూ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా ఉండే సినీ తారలు క్రికెట్ మైదానంలోకి అడుగపెట్టనున్నారు. బ్యాట్, బాల్ పట్టుకుని మైదానంలో సందడి చేయనున్నారు. క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)- 2023 కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తాజాగా ఈ మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదలైంది. ఈ శనివారం (ఫిబ్రవరి18) నుంచే ఈ పోటీలు మొదలుకానున్నాయి. ఇందులో మొత్తం 8 రాష్ట్రాలకు చెందిన సినీ సెలబ్రిటీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తెలుగు వారియర్స్ తో పాటు చెన్నై రైనోస్, ముంబై హీరోస్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, కేరళా స్ట్రైకర్స్, పంజాబ్ ది షేర్, బోజ్‌పురి దబాంగ్స్ జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఇక శనివారం రాయ్ పూర్ వేదికగా జరిగే మొదటి మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్ డోజర్స్ తలపడనున్నాయి.
కాగా సీసీఎల్ 2023 టోర్నమెంట్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనుంది. అంటే టోర్నీలో ఉన్న ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. అక్కడ మొదటి, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య తొలి సెమీస్ మ్యాచ్, 2, 3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య జరిగే మరో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు సీసీఎల్ టైటిల్ కోసం తలపడతాయి.
#ChennaiRhinos we r back ???India’s Biggest Sportainment Event Celebrity Cricket League (CCL) with 8 team from across 8 languages starts on 18th February.
Live on 9 Channels.#A23 #ParleHappyHappy#CCL2023#CCLStarting18thFeb pic.twitter.com/o75as1FFXO
— Arya (@arya_offl) February 12, 2023
కాగా ఈ టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టుకు నటుడు వెంకటేశ్ సహ నిర్వాహకుడిగానూ, అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ముంబాయి హీరోస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్‌ఖాన్, కెప్టెన్‌గా రితేశ్ దేశ్‌ముఖ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక చెన్నై రైనోస్ జట్టుకు కెప్టెన్ జీవా ఐకాన్ ప్లేయర్‌గానూ, విష్టు విశాల్ స్టార్ క్రీడాకారుడిగా ఉన్నారు. ఇక బోజ్‌పురి దబాంగ్ జట్టుకు మనోజ్ తివారి కెప్టెన్‌గా, కేరళా స్ట్రైకర్స్ జట్టుకు నటుడు మోహన్‌లాల్ సహ నిర్వాహకుడిగా, కుంజాకోబోపన్ కెప్టెన్‌గా ఉన్నారు.
#CelebrityCricketLeague From Feb 18? pic.twitter.com/hMXLQ4AY9r
— Lets OTT (@IetsOTT) February 4, 2023
అఖిల్ అక్కినేని (కెప్టెన్), వెంకటేష్, సచిన్ జోషి, సుధీర్ బాబు, తరుణ్, ప్రిన్స్, సాయిధరమ్ తేజ్, అజయ్, అశ్విన్ బాబు, ఆదర్శ్ బాలకృష్ణ, నందకిషోర్, విశ్వ, నిఖిల్, ప్రభు, రఘు, సుశాంత్, శ్రీకాంత్, సామ్రాట్ రెడ్డి.
#CelebrityCricketLeague pic.twitter.com/8P8vOfvY3L
— పవన్ నాయుడు (@ucangetpavan) February 15, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..