రోడ్డు ప్రమాదం.. ప్రముఖ లిరిసిస్ట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

| Edited By:

Nov 18, 2020 | 1:13 PM

కోలీవుడ్‌ ప్రముఖ లిరిసిస్ట్‌ స్నేహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల స్నేహన్‌ ప్రయాణిస్తోన్న కారు తిరుమాయం వద్ద ప్రమాదానికి గురైంది.

రోడ్డు ప్రమాదం.. ప్రముఖ లిరిసిస్ట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
Follow us on

Case against Snehan: కోలీవుడ్‌ ప్రముఖ లిరిసిస్ట్‌ స్నేహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల స్నేహన్‌ ప్రయాణిస్తోన్న కారు తిరుమాయం వద్ద ప్రమాదానికి గురైంది. స్నేహన్‌ కారు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా.. దానిపై ఉన్న అరుణ్‌ పాండియన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే యాక్సిడెంట్‌ చేసినందుకు గానూ స్నేహన్‌పై కేసు నమోదైంది. కాగా లిరిసిస్ట్‌గా కోలీవుడ్‌లో మంచి పేరును సంపాదించుకున్న స్నేహన్‌.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. లోకనాయకుడు కమల్‌ హాసన్ మక్కల్ నీది మయ్యంలో స్నేహన్ ప్రస్తుతం కొనసాగుతున్నారు.

Read more:

పెరిగిన సోనూసూద్‌ క్రేజ్.. ‘ఆచార్య’ పాత్రలో పలు మార్పులు..!

దగ్గరపడుతున్న పెళ్లి డేట్.. ఉదయ్‌పూర్‌లో అడుగెట్టిన మెగా డాటర్‌ నిహారిక