Tollywood: స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతోన్న ఈ అందాల బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఓ చిన్న క్లూ..

|

Dec 04, 2022 | 2:47 PM

ఓ అందాల ముద్దుగుమ్మ తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ.. స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతూ.. సేద తీరుతోంది.. ఆమెవరో గుర్తుపట్టారా.?

Tollywood: స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతోన్న ఈ అందాల బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఓ చిన్న క్లూ..
Tollywood Heroine
Follow us on

సినిమా.. సినిమాకు గ్యాప్ దొరికినప్పుడల్లా సెలబ్రిటీలు వెకేషన్‌కు వెళ్తుండటం సర్వసాధారణం. ముఖ్యంగా హీరోయిన్లు తాము చేస్తోన్న సినిమా షూటింగ్‌లు పూర్తయితే చాలు.. మాల్దీవులు లేదా థాయ్‌ల్యాండ్ లాంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. సముద్రపు ఒడ్డున సేద తీరుతుంటారు. ఈ క్రమంలోనే ఓ అందాల ముద్దుగుమ్మ తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ.. స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతూ.. తన తడి అందాలతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇంతకీ ఆమె ఎవరో కనిపెట్టగలరా.? ఆమె తెలుగు తెరకు ఓ మెగా హీరో సినిమా ద్వారా పరిచయమైంది. ఆ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకుడు. ఇక ఆ తర్వాత హిందీలో ‘ఎం ఎస్ ధోని’ బయోపిక్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గుర్తొచ్చిందా ఆమెవరో.? ఇంకా లేదా.?

సరే అయితే ఈసారి ఇచ్చే క్లూతో మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు. హిందీలో హిటైన ‘భాగీ’ సినిమాలో ఈమె హీరోయిన్. హా.. ఎస్ మీరు అనుకున్నది కరెక్టే.. ఈ బ్యూటీ మరెవరో కాదు దిశా పటానీ. ‘ఎం ఎస్ ధోని’ బయోపిక్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటానీ.. ఆ తర్వాత భాగీ 2, భారత్, రాధే, ఏక్ విలన్ రిటర్న్స్ లాంటి చిత్రాల్లో నటించింది. ‘లోఫర్’ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది. కాగా, ప్రస్తుతం దిశా పటానీ ‘యోధ’, ‘ప్రాజెక్ట్ కే’, తమిళంలో మరో సినిమా నటిస్తోంది.