AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIT 2 collection Day 2: బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నా హిట్ 2 హావా.. భారీగా పెరిగిన వసూళ్లు..

శేష్ కెరీర్ లో హైయెస్ట్ ఓపినింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా హిట్ 2 నిలిచింది. ఫస్ట్ డే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 6.34 కోట్ల షేర్ రాబట్టింది.

HIT 2 collection Day 2: బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నా హిట్ 2 హావా.. భారీగా పెరిగిన వసూళ్లు..
Hit 2
Rajitha Chanti
|

Updated on: Dec 04, 2022 | 11:52 AM

Share

మేజర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన హిట్ 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమాలో శేష్ ప్రధాన పాత్రలో నటించారు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతున్న ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. శేష్ కెరీర్ లో హైయెస్ట్ ఓపినింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా హిట్ 2 నిలిచింది. ఫస్ట్ డే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 6.34 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.96 కోట్లు కలెక్ట్ చేయగా.. ఓవర్సీస్..రూ. 1.95 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు హిట్2 హావా కొనసాగింది. ముఖ్యంగా వీకెండ్ కావడంతోఈ సినిమా కలెక్షన్స్ రెట్టింపు అయ్యాయి.

నివేదికల ప్రకారం హిట్ 2 సినిమా రెండవ రోజు రూ. 12.67 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. నైజాంలో రూ. 1.74 కోట్లు.. సీడెడ్ రూ. 36 లక్షలు.. ఉత్తరాంధ్రలో రూ. 42 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రా.. తెలంగాణలో రూ. 7.31 కోట్లు షేర్.. రూ. 11.90 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 19.15 కోట్లు గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

గతంలో సూపర్ హిట్ అందుకున్న హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చింది హిట్ 2. ఇక త్వరలోనే హిట్ 3 కూడా రాబోతుందని తెలియజేశారు మేకర్స్. ఇందులో న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో కనిపించనుండగా.. విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పోస్టాఫీస్ ద్వారా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడం ఎలా..?
పోస్టాఫీస్ ద్వారా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడం ఎలా..?
మైదానంలోనే పొట్టుపొట్టుగా తిట్టుకున్న ప్లేయర్లు..!
మైదానంలోనే పొట్టుపొట్టుగా తిట్టుకున్న ప్లేయర్లు..!
గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రముఖ క్రికెటర్ బ్యాట్లు చోరీ
గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రముఖ క్రికెటర్ బ్యాట్లు చోరీ
నవరాత్రుల్లో అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు జాక్ పాట్
నవరాత్రుల్లో అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు జాక్ పాట్
పిడుగులు, ఈదురుగాలుల ముప్పు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో
పిడుగులు, ఈదురుగాలుల ముప్పు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మూవీ..
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మూవీ..
కోడి ముందా.. గుడ్డు ముందా? వెయ్యేళ్ల ప్రశ్నకు సైంటిస్టుల ఆన్సర్!
కోడి ముందా.. గుడ్డు ముందా? వెయ్యేళ్ల ప్రశ్నకు సైంటిస్టుల ఆన్సర్!
బ్రెడ్‌, జామ్‌ తిన్న కుటుంబం.. తెల్లాసరికల్లా విషాదం!
బ్రెడ్‌, జామ్‌ తిన్న కుటుంబం.. తెల్లాసరికల్లా విషాదం!
GATE 2027 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెరిగిందోచ్.. ఎప్పటివరకంటే?
GATE 2027 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెరిగిందోచ్.. ఎప్పటివరకంటే?
ఆ స్టార్ హీరోతో నాకు మంచి బాండింగ్ ఉంది..
ఆ స్టార్ హీరోతో నాకు మంచి బాండింగ్ ఉంది..