డబ్బు విషయంలో అలా ఉన్నా కాబట్టే.. 23 మందికి పెళ్లి చేశా..!

| Edited By:

Apr 26, 2020 | 9:05 AM

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీతో కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. అయితే రెమ్యునరేషన్‌ విషయంలో బ్రహ్మానందంపై ఇప్పటికి చాలా రూమర్లు వచ్చాయి. పారితోషికం విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని చాలా మంది అంటుంటారు. ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు బ్రహ్మీ. ఇండస్ట్రీలో చాలా మంది నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకోలేదు కానీ ఏం నేర్చుకోకూడదో తెలుసుకున్నా. ఇక్కడ డబ్బుని పెద్దగా పట్టించుకోని వాళ్లు […]

డబ్బు విషయంలో అలా ఉన్నా కాబట్టే.. 23 మందికి పెళ్లి చేశా..!
Follow us on

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీతో కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. అయితే రెమ్యునరేషన్‌ విషయంలో బ్రహ్మానందంపై ఇప్పటికి చాలా రూమర్లు వచ్చాయి. పారితోషికం విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని చాలా మంది అంటుంటారు. ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు బ్రహ్మీ.

ఇండస్ట్రీలో చాలా మంది నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకోలేదు కానీ ఏం నేర్చుకోకూడదో తెలుసుకున్నా. ఇక్కడ డబ్బుని పెద్దగా పట్టించుకోని వాళ్లు చాలా మంది ఉన్నారు. నా వరకు నేను డబ్బు విషయంలో గట్టిగా ఉంటా. అలా లేకపోతే రోజుకి వంద రూపాయలు ఇచ్చేవాడు.. పది రూపాయలు ఇస్తానంటే నా జీవితం ఎలా ఉంటుంది..? అందుకే నేను డబ్బుకు గౌరవం ఇవ్వడం నేర్చుకున్నా. అలా గౌరవం ఇచ్చాను కాబట్టే.. 23 మంది ఆడపిల్లలకు పెళ్లి చేశా. వారికి పెళ్లి చేయకపోతే జీవితాలు ఏమయ్యేవి..? ఆ బాధ్యతతోనే వారికి పెళ్లి చేశా. అయినా అవన్నీ నేను చెప్పుకోవాల్సిన విషయాలు కాదు అని బ్రహ్మానందం వెల్లడించారు.

Read This Story Also: షాకింగ్ న్యూస్.. మనం వదిలే గ్యాస్ నుంచి కరోనా..!