షాకింగ్ న్యూస్.. మనం వదిలే గ్యాస్ నుంచి కరోనా..!

కరోనా వైరస్ వ్యాప్తికి ఎలా జరుగుతుందన్న దానిపై శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్లు

షాకింగ్ న్యూస్.. మనం వదిలే గ్యాస్ నుంచి కరోనా..!
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 8:06 AM

కరోనా వైరస్ వ్యాప్తికి ఎలా జరుగుతుందన్న దానిపై శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్లు ఎదుటి వ్యక్తి మీద పడితేనో.. లేకపోతే ఆ తుంపర్లు పడిన చోట మరో వ్యక్తి తాకితేనో వైరస్ సోకుతుందని భావించారు. అయితే తాజా స్టడీ ప్రకారం మనం వదిలే అవపాన వాయువులు(పిత్తుల) వలన కూడా కరోనా వ్యాప్తి చెందుతుందట. వినడానికి కాస్త నవ్వొస్తున్నా.. మీరు చదువుతున్నది నిజంగా నిజమేనండి.

దగ్గులోనే కాకుండా శరీరం నుంచి బయటకి వచ్చే గ్యాస్ నుంచి కూడా కరోనా సోకుతుందని.. అందుకే బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్‌ను వదలకండి అంటూ ఆస్ట్రేలియా డాక్టర్ ఆండీ టాగ్‌ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దుస్తులు లేనప్పుడు గ్యాస్ వదలడం వలన వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. అందుకే గ్యాస్ వదిలే సమయంలోనూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన సూచిస్తున్నారు. మరి మామూలుగా తుమ్మే వారిని అయితే కర్చీఫ్ అడ్డుపెట్టుకోమని చెప్పొచ్చు.. కానీ గ్యాస్‌ వదిలే వారిని ఏమని వారించగలము. ఎలా వారించగలమన్నది మాత్రం కాస్త కష్టమైన ప్రశ్ననే.

Read This Story Also: అనంతపురంకు రెండు భారీ పరిశ్రమలు.. ఉత్తర్వులు జారీ..!