Katrina Kaif: పెళ్లి తర్వాత తొలిసారిగా స్ర్కీన్‌పై రొమాంటిక్‌ కపుల్‌.. వైరలవుతోన్న కత్రినా, విక్కీల ఫొటోలు

|

Sep 14, 2022 | 9:13 PM

Katrina Kaif- Vicky Kaushal: ప్రస్తుతం బాలీవుడ్‌లో ది మోస్ట్‌ రొమాంటిక్ కపుల్‌ అంటే ఠక్కున వచ్చే సమాధానం కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జోడి. గతేడాది డిసెంబర్‌ 9న రాజస్తాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో పెళ్లిపీటలెక్కారీ లవ్లీ కపుల్‌.

Katrina Kaif: పెళ్లి తర్వాత తొలిసారిగా స్ర్కీన్‌పై రొమాంటిక్‌ కపుల్‌.. వైరలవుతోన్న కత్రినా, విక్కీల ఫొటోలు
Katrina Kaif Vicky Kaushal
Follow us on

Katrina Kaif- Vicky Kaushal: ప్రస్తుతం బాలీవుడ్‌లో ది మోస్ట్‌ రొమాంటిక్ కపుల్‌ అంటే ఠక్కున వచ్చే సమాధానం కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జోడి. గతేడాది డిసెంబర్‌ 9న రాజస్తాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో పెళ్లిపీటలెక్కారీ లవ్లీ కపుల్‌. అయితే పెళ్లి రోజు వరకు తమ రిలేషన్‌షిప్‌ విషయంలో ఎంతో గోప్యత పాటించారు. సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చినా తమ పెళ్లిపై ఇద్దరు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పెళ్లయిన మరుక్షణమే తమ పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన వీరి గ్రాండ్‌ వెడ్డింగ్‌కు ప్రముఖ బాలీవుడ్‌ నటులు హాజరయ్యారు. కాగా పెళ్లి తర్వాత సినిమా షూటింగులతో మళ్లీ బిజిబిజీగా మారిపోయారీ లవ్లీ కపుల్‌. కాగా వీరిద్దరు సిల్వర్‌ స్ర్కీన్‌పై జంటగా ఒకసారి కూడా కనిపించలేదు. అయితే తాజాగా ఆ లోటు తీరిపోయింది. ఓ వాణిజ్య ప్రకటనలో ఈ రొమాంటిక్‌ కపుల్‌ కలిసి నటించారు. ఇప్పుడు ఆ ఫొటోలు బయటకు రాగా క్షణాల్లోనే వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే ఇటీవల కాఫీ విత్ కరణ్‌ షోకు తన భర్త విక్కీతో కలిసి హాజరైంది కత్రినా. ఈ సందర్భంగా తమ లవ్‌, డేటింగ్, రిలేషన్‌షిప్‌ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ఫోన్‌ బూత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది కత్రినా. దీంతో పాటు విజయ్‌ సేతుపతితో కలిసి మేరీ క్రిస్మస్‌, అలాగే సల్మాన్‌ తో కలిసి టైగర్‌ 3 చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇక విక్కీ గోవిందా నామ్ మేరా, ద గ్రేట్‌ ఇండియన్ ఫ్యామిలీ, డుంకీ తదితర సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..