Urvashi Rautela: ‘ఫోన్ ఇస్తాను.. కానీ ఈ కండీషన్ ఒప్పుకో’.. ఊర్వశికి మెయిల్ పంపిన అజ్ఞాతవాసి..

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‏లో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా తన ఫోన్ ఎవరికైనా దొరికితే తనకు తిరిగి ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ప్రకటించింది. తన ఫోన్ పొగోట్టుకున్న లోకేషన్ సైతం షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఊర్వశికి తన గోల్డ్ ఫోన్ గురించి ఓ మెయిల్ వచ్చింది. ఆమెకు ఫోన్ రిటర్న్ ఇవ్వాలంటే ఓ కండిషన్ ఒప్పుకోవాలంటూ అజ్ఞాతవాసి మెయిల్ పంపాడట.

Urvashi Rautela: ఫోన్ ఇస్తాను.. కానీ ఈ కండీషన్ ఒప్పుకో.. ఊర్వశికి మెయిల్ పంపిన అజ్ఞాతవాసి..
Urvashi Rautela

Updated on: Oct 20, 2023 | 12:26 PM

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇటీవల ఇండియా వర్సెస్ పాకిస్థాన్ వరల్డ్ కప్ 2023 మ్యాచ్‏లో తన 24 క్యారెట్ల గోల్డ్ ఐఫోన్‌ను పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‏లో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా తన ఫోన్ ఎవరికైనా దొరికితే తనకు తిరిగి ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ప్రకటించింది. తన ఫోన్ పొగోట్టుకున్న లోకేషన్ సైతం షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఊర్వశికి తన గోల్డ్ ఫోన్ గురించి ఓ మెయిల్ వచ్చింది. ఆమెకు ఫోన్ రిటర్న్ ఇవ్వాలంటే ఓ కండిషన్ ఒప్పుకోవాలంటూ అజ్ఞాతవాసి మెయిల్ పంపాడట. ఈ విషయాన్ని మళ్లీ ఊర్వశి చెప్పుకొచ్చింది.

ఊర్వశికి వచ్చిన మెయిల్‏లో ఇలా ఉంది.. “నా వద్ద మీ ఫోన్ ఉంది. మీకు మీ మొబైల్ రిటర్న్ కావాలంటే.. మీరు నా సోదరుడిని క్యాన్సర్ నుండి రక్షించడానికి నాకు సహాయం చేయాలి” అంని కండిషన్ పెట్టాడట. ఈమెయిల్ ఊర్వశికి Groww Traders ఇమెయిల్ ఐడి ద్వారా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అతడికి కండిషన్ కు ఒప్పుకున్నట్లు థంబ్స్ అప్ ఎమోజీతో తన ఇన్ స్టా స్టోరీలో ఈమెయిల్ స్క్రీన్ షాట్ షేర్ చేసింది. అయితే ఊర్వశి ఫోన్ పోవడం.. నటి ట్వీట్ చేయడంపై అభిమానుల నుంచి అనేక కామెంట్స్ వస్తున్నాయి. అన్‌వర్స్డ్ ఫోన్‌కు రూ. 1 కోటి ఖర్చవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు.. తన ట్విట్టర్ వేదికగా.. “అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నా 24 క్యారెట్ల నిజమైన బంగారు ఐ ఫోన్‌ పోయింది! ️ ఎవరికైనా దొరికితే.. దయచేసి సహాయం చేయండి. ASAP నన్ను సంప్రదించండి! అంటూ రాసుకొచ్చింది. ఇటీవల వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యింది ఈ బీటౌన్ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.