Alia Bhatt: సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న బాలీవుడ్ స్టార్ కపుల్ ..?

|

Apr 30, 2023 | 9:56 AM

బ్రహ్మాస్త్ర సినిమాతో తెర మీద జంటగా కనిపించిన ఆలియా, రణబీర్‌.. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమలో పడి పెళ్లి చేసేసుకున్నారు. ఆ వెంటనే పేరెంట్స్ పోస్ట్‌కీ ప్రమోట్ అయ్యారు. దీంతో ఈ క్యూట్‌ కపుల్‌ సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటారా అన్న చర్చ జరిగింది.

Alia Bhatt: సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న బాలీవుడ్ స్టార్ కపుల్ ..?
Ranbir Kapoor And Alia Bhat
Follow us on

రీసెంట్‌గా అమ్మ పోస్ట్‌కు ప్రమోట్‌ అయిన ఆలియా భట్‌… పర్సనల్‌ లైఫ్‌ను ప్రొఫెషనల్ కెరీర్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ముందే ప్లాన్ చేసినట్టుగా కూతురి బాధ్యతలను షేర్ చేసుకుంటూ షూటింగ్స్‌ ఫినిష్ చేస్తున్నారు. అయితే ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా.. ఏదో టెన్షన్ మాత్రం తనను ఇబ్బంది పెడుతుందంటున్నారు ఆలియా భట్‌. బ్రహ్మాస్త్ర సినిమాతో తెర మీద జంటగా కనిపించిన ఆలియా, రణబీర్‌.. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమలో పడి పెళ్లి చేసేసుకున్నారు. ఆ వెంటనే పేరెంట్స్ పోస్ట్‌కీ ప్రమోట్ అయ్యారు. దీంతో ఈ క్యూట్‌ కపుల్‌ సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటారా అన్న చర్చ జరిగింది. కానీ రాలియా జంట మాత్రం ప్రొఫెషనల్ కెరీర్‌ విషయంలో పక్కా క్లారిటీతో ఉంది.

ఆఫ్టర్ డెలివరీ ఆలియా కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నా.. రణబీర్‌ మాత్రం షార్ట్ గ్యాప్‌లోనే షూటింగ్‌లకు హాజరయ్యారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్‌ షూటింగ్‌తో పాటు లవ్‌ రంజన్ డైరెక్ట్ చేసిన తూ ఝూటీ మై మక్కర్ ప్రమోషన్స్‌లోనూ పాల్గొన్నారు. ఆ తరువాత రణబీర్‌ కాస్త ఫ్రీ అవ్వటంతో ఆలియా కూడా షూటింగ్‌లకు హాజరయ్యారు. ఈ మధ్య రెగ్యులర్‌గా ఫిలిం ఈవెంట్స్‌లోనూ సందడి చేస్తున్నారు.

ఇంత పర్ఫెక్ట్‌గా కెరీర్‌ను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేస్తున్నా.. ఇంకా ఏదో టెన్షన్ అయితే ఉందంటున్నారు ఆలియా భట్‌. తన కూతురు రాహ విషయంలో అన్ని సరిగ్గానే చేస్తున్నానా లేదా అన్న అనుమానం తనను ప్రతీ క్షణం ఇబ్బంది పెడుతుందన్నారు. అయితే అమ్మగా ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఓ వైపు హీరోయినగా గ్లామర్ వరల్డ్‌లో కంటిన్యూ అవుతూనే రెస్పాన్సిబుల్ మదర్‌గానూ తన రోల్‌ను పర్ఫెక్ట్‌గా ప్లే చేస్తున్నారు ఈ క్యూటీ.