KK Last Performance Video: చివరి పాట ఇదే.. మరణానికి ముందు లైవ్ షోలో పాడిన కేకే.. వైరల్ వీడియో

|

Jun 01, 2022 | 3:09 AM

Singer KK Passes Away: విశాల్ భరద్వాజ్ నిర్మించిన 'హమ్ దిల్ దే చుకే సనమ్'లోని 'తడప్ తడప్ కే' అనే ఐకానిక్ పాట ఓ సంచలనం. కేకే పాడిన ఈ పాటను, ఆయన ఎక్కడికి వెళ్లినా పాడమని ఫ్యాన్స్ అడుగుతుంటారు.

KK Last Performance Video: చివరి పాట ఇదే.. మరణానికి ముందు లైవ్ షోలో పాడిన కేకే.. వైరల్ వీడియో
Singer Kk
Follow us on

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ (కేకే)(KK) 53 సంవత్సరాల వయస్సులో మరణించారు(Singer KK Passes Away). కోల్‌కతాలోని వివేకానంద కాలేజీకి చెందిన నజ్రుల్ మంచ్‌లో ఓ షోలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ సమయంలో గుండెపోటుకు గురై, మెట్లపై కూలిపోయాడు. ఆ తర్వాత కేకేను కోల్‌కతాలోని మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కేకేను పరీక్షించి, అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఆయన ఆకస్మిక మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. లైవ్ షో సందర్భంగా కేకే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన రెండు ఫొటోలను పంచుకున్నాడు. ఇదే కేకే చేసిన చివరి పోస్ట్‌గా నిలిచింది. అలాగే ఆయన చేసిన చివరి స్టేజ్ షో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌(KK Last Video)గా మారింది. ఈ వీడియోను చూస్తూ, ఫ్యాన్స్ కుమిలిపోతున్నారు.

కేకే చివరి వీడియో..

ఇవి కూడా చదవండి

ఈ స్టేజ్ షోలో కేకే చివరి వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిలో కేకే తన సొంత ఆల్బమ్ ‘పాల్’లోని టైటిల్ సాంగ్ ‘పాల్’ పాడుతున్నట్లు చూడొచ్చు. కేకే(KK) ఆకస్మిక మరణంతో, అతని అభిమానులు, కుటుంబంతోపాటు బాలీవుడ్‌ షాక్‌లో కూరుకపోయారు. కేకే జీవితంలోని చివరి లైవ్ షో చూసి ఎంజాయ్ చేస్తారని కాలేజీలో ఉన్నవాళ్లు కూడా అనుకోలేదు. అంతేకాదు తనకు ఈ ప్రమాదం జరగబోతోందని కేకే కూడా ఊహించి ఉండరు. కేకే హఠాన్మరణం అందరినీ కలిచివేసింది.

3000కి పైగా పాటలు పాడిన కేకే..

1999 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో, అతను భారత జట్టుకు మద్దతుగా ‘జోష్ ఆఫ్ ఇండియా’ పాటను పాడాడు. దీని తర్వాత అతను తన మొదటి సంగీత ఆల్బమ్ ‘పాల్’ని విడుదల చేశాడు. ఇది ఉత్తమ సోలో ఆల్బమ్‌గా స్టార్ స్క్రీన్ అవార్డును పొందింది. కేకే బాల్యంలో డాక్టర్ కావాలనుకున్నాడంట. కేవలం రెండు సంవత్సరాల వయస్సులోనే కేకే.. తన మొదటి ప్రదర్శన ఇచ్చాడు. ప్రజలు అతని వాయిస్‌ని ఎంతగానో ఇష్టపడ్డారు. ఢిల్లీలోని అనేక యాడ్ ఏజెన్సీలు అతని వాయిస్‌ని ఉపయోగించాయి. తన స్నేహితులతో కలిసి రాక్ బ్యాండ్‌ని కూడా ఏర్పాటు చేశాడు.

ముంబైకి వెళ్లడానికి ముందు, కేకే హోటల్ పరిశ్రమలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశారు. 1994లో ముంబైకి వెళ్లారు. ఆ సమయంలో సినిమాల్లో పాడేందుకు చాలా కష్టపడ్డాడు. అతని కొడుకు నకుల్ కూడా అదే సంవత్సరంలో జన్మించాడు. అదే రోజు UTV కూడా అతనిని సమావేశానికి పిలిచింది. ఇక్కడ అతనికి శాంటోజెన్ సూటింగ్ యాడ్ కోసం పాడే అవకాశం వచ్చింది. 4 సంవత్సరాల వ్యవధిలో, అతను 11 భారతీయ భాషలలో సుమారు 3,500 పాటలు పాడాడు. కేకే హిందీలో 250కి పైగా పాటలు, తమిళం, తెలుగులో 50కి పైగా పాటలు పాడారు.