Stree 2 Teaser: ఆమె మళ్లీ 6 ఏళ్ల తర్వాత వస్తోంది.. గుండెల్లో భయాన్ని పుట్టించే స్త్రీ.. శ్రద్ధా కపూర్ స్త్రీ 2 టీజర్ విడుదల..

తాజాగా ఈ స్త్రీ 2 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొన్ని సెకన్లపాటు సాగే ఈ టీజర్ లో రాజ్ కుమార్ తోపాటు పంకజ్ త్రిపాఠి, అపర్శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ చందేరీ కనిపించారు. స్త్రీ అనే శక్తి పురుషులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది కనిపిస్తుంది. మొదటి భాగంలో మిస్టరీగా మిగిలిపోయిన శ్రద్ధా కపూర్ ఇప్పుడు సీక్వెల్ లో పవర్ ఫుల్ గా కనిపించనుంది.

Stree 2 Teaser: ఆమె మళ్లీ 6 ఏళ్ల తర్వాత వస్తోంది.. గుండెల్లో భయాన్ని పుట్టించే స్త్రీ.. శ్రద్ధా కపూర్ స్త్రీ 2 టీజర్ విడుదల..
Stree 2 Teaser
Follow us

|

Updated on: Jun 25, 2024 | 1:59 PM

ప్రేక్షకుల హృదయాలలో భయాన్ని కలిగించడానికి స్త్రీ మళ్లీ వస్తుంది. అడియన్స్ ఎంతో ఎదురుచూస్తున్న స్త్రీ మూవీ సీక్వెల్ స్త్రీ 2 ఇప్పుడు థియేటర్లలోకి రానుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కలిసి నటించిన స్త్రీ మూవీ 2018లో విడుదలైన సంగతి తెలిసిందే. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత స్త్రీ మూవీ సీక్వెల్ రాబోతుంది. తాజాగా ఈ స్త్రీ 2 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొన్ని సెకన్లపాటు సాగే ఈ టీజర్ లో రాజ్ కుమార్ తోపాటు పంకజ్ త్రిపాఠి, అపర్శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ చందేరీ కనిపించారు. స్త్రీ అనే శక్తి పురుషులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది కనిపిస్తుంది. మొదటి భాగంలో మిస్టరీగా మిగిలిపోయిన శ్రద్ధా కపూర్ ఇప్పుడు సీక్వెల్ లో పవర్ ఫుల్ గా కనిపించనుంది.

ఈ మూవీ మొదటి భాగం అభిమానులను ఎంతగానో అలరించింది. టీజర్ బాగా నచ్చింది. ఇప్పుడు ఈ సినిమా తరహాలోనే రెండో భాగం రూపొందింది. ఆ మహిళ 6 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తోంది అంటూ టీజర్ షేర్ చేసింది శ్రద్ధా కపూర్. కామెడీ , హార్రర్ తోపాటు స్త్రీ కోపం ఎంత భయంకరంగా ఉంటుందో.. మహిళలు ఎంత శక్తివంతగా ఉంటారు అనే విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అయితే తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది.

ఈ స్త్రీ 2 చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మడాక్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. స్త్రీ, రూహి, భేదియా వంటి చిత్రాల మాదిరిగానే భయానక కామెడీ ప్రపంచంలో స్త్రీ 2 మరో భాగం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.