రష్మిక అందానికి కారణం అదే.. హ్యాండ్ బ్యాగ్‌లో అది పక్కాగా ఉండాల్సిందే
05 September 2024
Basha Shek
ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో రష్మిక మందన్నా మొదటి స్థానంలో ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోందీ అందాల తార.
ముఖ్యంగా పుష్ప, యానిమల్ సినిమాల్లో నటించిన తర్వాత రష్మిక మందన్నా క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ కు చేరుకుంది.
సినిమాల్లో ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించాలంటే అందంతో పాటు మంచి ఫిట్ నెస్ మెయింటైన్ చేయాల్సిందే.
ఈ విషయం రష్మిక మందన్నాకు బాగా తెలుసు. అందుకే అందంతో పాటు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద వహిస్తోందీ అందాల తార.
ముఖ్యంగా జిమ్ విషయంలో షూటింగ్ కోసం అవుట్ డోర్ వెళ్లినా కాని ఆమె వర్కౌట్స్ ను మానేయదట. ఏదో ఒక ప్లేస్ చూసుకుని చేసేస్తుందట.
ఇక రష్మిక స్కిన్ గ్లో కు కారణం వాటరేనట. అవును రోజుకి 7 లీటర్ల వాటర్ పక్కాగా తాగేస్తుందటఈ అందాల తార.
నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు వాటర్ ని మిస్ అవ్వకుండా గుర్తు పెట్టకుని మరీ బాగా ఎక్కువగా తీసుకుంటుందట రష్మిక.
ఎక్కడికి వెళ్ళినా సరే ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఉండాల్సిందేనట. అలాగే వాటర్ మిలన్ తో పాటు.. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగుతుందట