జాలువారుతున్న హెబ్బా అందాలు.. పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్న కుర్రకారు
Phani CH
06 SEp 2024
ట్రెండీ వేర్లో హెబ్బా పటేల్ పరువాల ప్రదర్శనకు పెట్టింది. ఆమె బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది. క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.
హెబ్బా పటేల్ కి సినిమాల్లో అవకాశాలు తగ్గాయి అనిపిస్తుంది. మహారాష్ట్రకు చెందిన హెబ్బా... కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.
‘అల ఎలా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి కుమారి 21ఎఫ్, ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ వంటి హిట్ చిత్రాలతో చేసింది.
కానీ ఆ తర్వాత వరుణ్ తేజ్ తో చేసిన ‘మిస్టర్’ మూవీ నుండీ ఈమెను ఫ్లాప్ లు వెంటాడాయి. ఈ క్రమంలో ఆమె గ్లామర్ పై ఆధారపడాల్సి వచ్చింది.
ఈ క్రమంలో చేసిన 24 కిస్సెస్ మూవీ ఈమె ఇమేజ్ ను కొంత డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. తర్వాత ఆమెకు ఆఫర్లు కూడా కరువయ్యాయి.
‘భీష్మ’ ‘రెడ్’ వంటి సినిమాల్లో గ్లామర్ షో చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక డీ గ్లామర్ రోల్ చేసిన ఓదెల రైల్వే స్టేషన్ ఇచ్చిన ఫలితం కూడా అంతంత మాత్రమే.
ఒక దశలో హెబ్బా నటన మానేస్తున్నారా? అనే సందేహాలు కలిగాయి. హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవడంతో హెబ్బా బరువు పెరిగింది. పూర్తిగా షేప్ అవుట్ అయ్యింది.