షారుఖ్ ఖానా మజాకా..! రూ. 18కోట్లు పెట్టి ఇల్లు కొంటే ఇప్పుడు రూ. 300కోట్లు..!!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఇప్పుడు హిందీ సినిమా ప్రపంచంలోని స్టార్ హీరోలలో ఒకరు. గత నాలుగు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరో. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

షారుఖ్ ఖానా మజాకా..! రూ. 18కోట్లు పెట్టి ఇల్లు కొంటే ఇప్పుడు రూ. 300కోట్లు..!!
Shahrukh Khan House

Updated on: Jul 15, 2026 | 11:48 AM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడిపిన కింగ్ ఖాన్ ఇప్పుడు సినిమా సినిమాకు గ్యాప్ ఇస్తున్నారు. తర్వాత, ప్రస్తుతం తన పని నుండి కొంత విరామం తీసుకుని కుటుంబంతో గడుపుతున్నారు. డంకి సినిమా తర్వాత ఇప్పటివరకూ సినిమా చేయలేదు షారుఖ్,  ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ కెరీర్ గురించి కాకుండా, ఆయన వ్యక్తిగత విషయాలు కూడా బీ టౌన్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అలాగే ఆయున ప్రతిష్టాత్మకమైన ఇల్లు మన్నత్ గురించి వివరాలు కూడా ఎప్పుడూ నెట్టింట షికారు చేస్తుంటాయి. ఆయున ఇల్లు గురించి తెలుసుకోవడానికి చాలా మంది గూగుల్ ను గాలిస్తుంటారు. ఆ వివరాలు ఒక్కసారి చూద్దాం.!

ఇది కూడా చదవండి : ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

షారుఖ్ ఖాన్ నివాసం పేరు మన్నత్, ముంబైలోని అత్యంత విలాసవంతమైన ఇల్లు ఇది. ఈ ఇంటి ఇంటీరియర్‌ను స్వయంగా షారుఖ్ ఖాన్ భార్య, గౌరీ ఖాన్ డిజైన్ చేశారు. వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌరీ ఖాన్, ఈ బంగ్లాను 1920ల శతాబ్దానికి అనుగుణంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. గతంలో ఈ విల్లా పేరు వియన్నా.. ఈ బంగ్లాను షారుఖ్ ఖాన్ తన కెరీర్ ప్రారంభ రోజుల్లో, అంటే 1995లో రూ.18.32 కోట్లకు కొనుగోలు చేశారు. ఆసక్తికరంగా, షారుఖ్ మొదట్లో ఈ బంగ్లా సమీపంలోనే నివసించేవారు, దీనిని కొనుగోలు చేయాలనే కోరిక ఆయనకు చాలా కాలంగా ఉండేదట. ఈ బంగ్లా అనేక బాలీవుడ్ చిత్రాలకు షూటింగ్ స్పాట్‌గా ఉండేది. సన్నీ డియోల్ నటించిన నరసింహ, డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గోవిందా నటించిన షోలా ఔర్ షబ్నం వంటి చిత్రాలు ఇక్కడ షూట్ చేశారు.

ఇది కూడా చదవండి : ఐరెన్ లెగ్ అని అవమానించారు.. 9 సినిమాలనుంచి తీసేశారు.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్

బంగ్లాను కొనుగోలు చేసిన తర్వాత, షారుఖ్ దాని పేరును మన్నత్ గా మార్చారు. మొదట దీనికి జన్నత్ అని పేరు పెట్టాలని అనుకున్నప్పటికీ, తర్వాత గౌరీ, షారుఖ్ ఇద్దరూ కలిసి దీనికి మన్నత్ అని పేరు పెట్టారు. మన్నత్ బంగ్లా నిర్మాణం ప్రత్యేకమైనది, ఈ విలాసవంతమైన ఇంటిలో ఐదు బెడ్‌రూమ్‌లు, ఒక మల్టీప్లెక్స్ లివింగ్ ఏరియా, ఆధునిక జిమ్,  ప్రశాంతమైన లైబ్రరీ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ కొనుగోలు చేయకముందు, విల్లా వియన్నా యజమాని గుజరాత్‌కు చెందిన పార్సీ, కికు గాంధీ. ఆయన ముంబైలోని ప్రఖ్యాత కెమౌల్డ్ ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకుడు కూడా. షారుఖ్ ఖాన్ బంగ్లాను కొనుగోలు చేసిన తర్వాత, దానిలో సరికొత్త మార్పులు చేశారు. గౌరీ ఖాన్ ఈ ఇంటి ఇంటీరియర్ అలాగే స్టైలింగ్ పనులను పూర్తి చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ బంగ్లా విలువ సుమారు రూ.200 కోట్లకు చేరిందని తెలుస్తుంది, ఇది కేవలం ఒక ఇల్లు మాత్రమే కాకుండా, ముంబైలో ఒక చారిత్రక, సందర్శనా స్థలంగా అలాగే షారుఖ్ ఖాన్ ప్రతిష్టకు చిహ్నంగా నిలిచిందని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us