
బాలీవుడ్ స్టార్ హరీఓయిన్ సారా అలీ ఖాన్ తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్ ప్రముఖ నటులు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ల కుమార్తె నే సారా. తండ్రి ముస్లిం, తల్లి సిక్కు. తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారు అయినప్పటికీ, సారా తనకు నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తోంది. కొన్నిసార్లు ఆమె కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లి శివుడికి పూజలు చేస్తుంటుంది. మరికొన్నిసార్లు ప్రార్థనలు చేయడానికి దర్గాకు వెళుతుంది. ఇక పలు సార్లు గురుద్వారాలోనూ కనిపించింది సారా. దీంతో చాలా మంది ఆమెను చాలాసార్లు ట్రోల్ చేశారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిందామె. ముస్లిం అయినప్పటికీ, హిందూ మత స్థలానికి వెళ్లి ప్రార్థనలు చేసినందుకు వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కొంటున్నవని సారాను అడిగారు. దీనికి ఆమె మాట్లాడుతూ.. ‘మొదట్లో నాకు దాని గురించి ఏమీ అర్థం కాలేదు. కానీ ఒక సందర్భంలో ‘ నేను ఎవరు?’ అని అమ్మను అడగాను. దానికి అమ్మ ‘నేను ముందు భారతీయురాలినని, ఆ తర్వాతే ఏదైనా అని సమాధానం ఇచ్చింది’
‘మన దేశం లౌకికమైనది. ఈ భావనలన్నీ, ఈ సరిహద్దులన్నీ వ్యక్తులు సృష్టించినవే. కాబట్టి నేను వారిని అనుసరించను. నేను అలాంటి వాటికి ప్రాధన్యం కూడ ఇవ్వను. ప్రజల ఆలోచనలను మార్చడానికి ప్రయత్నించడం అవివేకం. నేను దాని గురించి మాట్లాడకపోవడానికే ఇష్టపడతాను’ అని సారా చెప్పుకొచ్చింది.
కాగా సారా కేదార్‌నాథ్‌ను సందర్శించడం చాలాసార్లు కనిపించింది. ఆమె సంవత్సరంలో ఒకసారైనా
కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శిస్తుంది. దీని గురించి ఆమె ఇలా చెప్పింది, “కేదార్‌నాథ్ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఇది నా వ్యక్తిగత ప్రయాణం. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మనశ్శాంతి లభిస్తుంది. అక్కడ నేను సంతోషంగా ఉంటాను’ అని తెలిపింది సారా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.