కిచ్చా సుదీప్(Kiccha Sudeep).. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగులో విలన్ గా పరిచయమైన ఈ కన్నడ స్టార్ హీరో.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు.అలాగే సుదీప్ నటించిన సినిమాలు ఇటీవల తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ స్టార్ హీరో ఓ భారీ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రాంత్ రోణ`(Vikrant Rona) అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ’ చిత్రాన్ని అనుప్ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుదల చేస్తున్నారు. మొన్నామధ్య ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.
ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా అత్యున్నత సాంకేతిక విలువలతో హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాని రూపొందించారు. త్రీడీ ఫార్మాట్ లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 6ప్రధాన భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ హిందీ వర్షన్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సమర్పణలో నార్త్ ఆడియన్స్ కు అందించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర నిర్మాతలు ఓ వీడియోను వదిలారు. సల్మాన్ సమర్పకుడిగా వ్యవహరించడంతో ‘విక్రాంత్ రోణ’ సినిమాకు క్రేజ్ మరింత పెరిగింది. సుదీప్ కు సల్మాన్ మంచి మిత్రులు అన్న విషయం తెలిసిందే. సల్మాన్ ‘దబాంగ్ 3’ సినిమాలో సుదీప్ నటించాడు. ఇక ‘విక్రాంత్ రోణ’ చిత్రంలో నీతా అశోక్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో కనిపించనుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :