Salman Khan: సల్లూ భాయ్‌కి గన్ లైసెన్స్ వచ్చేసిందోచ్.. విల్లన్స్ బీ కేర్‌ఫుల్..

|

Aug 01, 2022 | 12:20 PM

దీంతో సల్మాన్‏కు అతడి కుటుంబానికి భద్రతను పెంచారు పోలీసులు. సల్మాన్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే సల్మాన్ బుల్లెట్ ప్రూప్ ల్యాండ్ క్రూయిజర్ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.

Salman Khan: సల్లూ భాయ్‌కి గన్ లైసెన్స్ వచ్చేసిందోచ్.. విల్లన్స్ బీ కేర్‌ఫుల్..
Salman
Follow us on

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‏కు (Salman Khan ) లైసెన్స్ గన్ వచ్చేసింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. స్వీయరక్షణ కోసం లైసెన్స్ గన్ పర్మిషన్ ఇవ్వాలంటూ ఇటీవల ముంబై పోలీసులకు అర్జీ పెట్టుకున్నాడు సల్మాన్. దీనిపై విచారణ భాగంగా పోలీసులు వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. ఇక ఇప్పుడు సల్లూభాయ్‏కు లైసెన్స్ గన్ జారీ చేసినట్లు సమాచారం. ఇటీవల సల్మాన్ ఖాన్ కు .. అతని తండ్రి సలీం ఖాన్ లకు హత్య చేస్తామని బెదిరింపులు లేఖలు వచ్చిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఈ లేఖలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో సల్మాన్‏కు అతడి కుటుంబానికి భద్రతను పెంచారు పోలీసులు. సల్మాన్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే సల్మాన్ బుల్లెట్ ప్రూప్ ల్యాండ్ క్రూయిజర్ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.

మే 29న పంజాబ్ లోని మాన్సా జిల్లాలో ఫేమస్ పంజాబీ సింగర్ సిద్ధు మూస్ వాలాను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఆ తర్వాత జూన్ 5న సల్మాన్, అతని తండ్రి సలీంఖాన్ లను చంపేస్తామని బెదిరింపులు లేఖలు వచ్చాయి. ముంబైలోని బాంద్రా సమీపంలో లేఖలు గుర్తించారు పోలీసులు. రోజూ సల్మాన్ ఈ ప్రదేశంలోనే తన రోటీన్ మార్నింగ్ జాగింగ్ చేస్తారు. ఈ క్రమంలోనే తన కుటుంబానికి రక్షణ కల్పించాలని అలాగే తనకు స్వీయరక్షణ కోసం లైసెన్స్ గన్ కావాలని ముంబై పోలీసులను ఆశ్రయించారు సల్మాన్. ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ కారు ఉపయోగిస్తున్న సల్మాన్ కు ఇప్పుడు లైసెన్స్ జారీ చేసినట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.