బ్యాన్ ఉన్నా పైరసీ చేసి మరీ ఆ  సినిమాను చూసేస్తోన్న పాక్ ప్రజలు.. సీడీలు ఎంతకు అమ్ముతున్నారో తెలుసా?

రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' సినిమాను పాకిస్తాన్, యూఏఈ ఇతర కొన్ని దేశాలు నిషేధించాయి. ఇక పాకిస్తాన్‌లో, భారతీయ సినిమాలపై గత కొన్ని సంవత్సరాలుగా నిషేధం ఉంది. అయినప్పటికీ, 'ధురంధర్' సినిమాను పాకిస్తానీయులు తెగ చూసేస్తున్నారు. ఎంతలా అంటే..

 బ్యాన్ ఉన్నా పైరసీ చేసి మరీ ఆ  సినిమాను చూసేస్తోన్న పాక్ ప్రజలు.. సీడీలు ఎంతకు అమ్ముతున్నారో తెలుసా?
Dhurandhar Movie

Updated on: Feb 14, 2026 | 10:40 AM

‘ ధురంధర్ ‘ సినిమా భారత బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. OTT లో విడుదలైన తర్వాత కూడా ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. పాకిస్తాన్ కు వెళ్లి ఉగ్రవాదులతో కలిసి వారిపై నిఘా పెట్టే ఓ స్పై ఏజెంట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. గతేడాది డిసెంబర్ 05న థియేట్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా యాక్షన్, పాటలు, నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద రూ. 1400 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. అయితే పాక్ తో పాటు కొన్ని ఇస్లామిక్ దేశాలు ఈ ధురంధర్ సినిమాను నిషేధించాయి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్‌లో, భారతీయ సినిమాలపై సంవత్సరాలుగా నిషేధం ఉంది. అయినప్పటికీ, ‘ధురంధర్’ సినిమా పాకిస్తాన్‌లో వైరల్ అవుతోంది. అక్కడి ప్రజలు ఈ సినిమా పైరేటెడ్ కాపీలను కొనుగోలు చేసి మరీ చూస్తున్నారు. ‘ధురంధర్’ సినిమాను పాకిస్తాన్‌లో పెద్ద ఎత్తున పైరసీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక విదేశీ పర్యాటకుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గతంలో భారతదేశాన్ని సందర్శించిన ట్రావెల్ వ్లాగర్ కర్ల్ రాక్ ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్నాడు. ‘ధురంధర్’ సినిమా DVDలు కరాచీలోని ఒక మార్కెట్లో అమ్ముడవుతున్నట్లు చూసి షాక్ అయ్యాడు. సినిమా DVD అమ్ముడవుతున్న వీడియోను కూడా అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

పాకిస్తాన్ మార్కెట్లలో ‘ధురంధర్’ సినిమా డివిడిలు కేవలం 16 రూపాయలకు (50 పాకిస్తానీ రూపాయలు) మాత్రమే లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా, డివిడి దుకాణాలు ప్రకటనల కోసం ‘ధురంధర్’ సినిమా పెద్ద పోస్టర్లను ఏర్పాటు చేశాయి. ఈ ‘ధురంధర్’ మూవీ పాకిస్తాన్ కు పూర్తి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు కూడా పాకిస్తాన్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. వివాహాలు, ఇతర కార్యక్రమాలలో ప్రజలు ఈ సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

షాపుల్లో విచ్చల విడిగా  ధురంధర్ మూవీ సీడీలు..

‘ధురంధర్’ సినిమా అపూర్వ విజయం తర్వాత, దాని సీక్వెల్ ‘ధురంధర్ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. రణవీర్ సింగ్ నటించిన ఈ క్రేజీ థ్రిల్లర్ మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈసారి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.