Aamir Khan: డ్రగ్స్ తీసుకున్నావా..? నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అమీర్ ఖాన్

ప్రస్తుతం 'సితారే జమీన్ పర్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈలోగా అభిమానులతో టచ్‌లో ఉండాలని అమీర్ ఖాన్ సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చాడు. ఇన్ స్టా వేదికగా ఆయన అభిమానులతో ముచ్చటించాడు . ఈ సమయంలో అభిమానులు ఆయనను అనేక ప్రశ్నలు అడిగారు. వాటి అమీర్ చాలా ఓపికగా సమాదానాలు చెప్పాడు. కానీ కొందరు అమీర్ ను ట్రోల్ చేస్తున్నారు. డ్రగ్స్ గురించి కూడా అమీర్ ఖాన్ ను ప్రశ్నించారు ఫ్యాన్స్.

Aamir Khan: డ్రగ్స్ తీసుకున్నావా..? నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అమీర్ ఖాన్
Aamir Khan

Updated on: Mar 08, 2024 | 5:16 PM

‘లాల్ సింగ్ చద్దా’ సినిమా తర్వాత బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కాస్త సైలెంట్ అయ్యారు . లాల్ సింగ్ చద్దా భారీ డిజాస్టర్ అవ్వడంతో అమీర్ నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘సితారే జమీన్ పర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈలోగా అభిమానులతో టచ్‌లో ఉండాలని అమీర్ ఖాన్ సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చాడు. ఇన్ స్టా వేదికగా ఆయన అభిమానులతో ముచ్చటించాడు . ఈ సమయంలో అభిమానులు ఆయనను అనేక ప్రశ్నలు అడిగారు. వాటి అమీర్ చాలా ఓపికగా సమాదానాలు చెప్పాడు. కానీ కొందరు అమీర్ ను ట్రోల్ చేస్తున్నారు. డ్రగ్స్ గురించి కూడా అమీర్ ఖాన్ ను ప్రశ్నించారు ఫ్యాన్స్. దీనిపై అమీర్ ఖాన్ స్పందించారు.

అమీర్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ లో మాట్లాడుతూ.. ఫ్యాన్స్ ప్రశ్నలకు బదులిచ్చాడు. లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు అమీర్ ఖాన్ ముఖం పాలిపోయినట్లు కనిపించింది. ‘సార్, మీరు డ్రగ్స్ తీసుకున్నట్లుంది. డ్రగ్స్ తీసుకోవడం మానేయండి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అమీర్ ఖాన్ కావాలంటే ఈ కామెంట్ ను పట్టించుకోకుండా ఉండేవాడు. కానీ అలా చేయలేదు.  అమీర్ ఖాన్ ‘ఏం చెప్తున్నావ్?’ అని అన్నారు. దాంతో తాను డ్రగ్స్ తీసుకోను అని చెప్పకనే చెప్పారు అమీర్. దాంతో  కొందరు మీ స్టైలిస్ట్‌ను మార్చుకోవాలని కూడా సూచించారు. ‘నా శైలి వేరు. కాబట్టి చాలా మందికి నచ్చదు’ అని అమీర్ ఖాన్ అన్నారు.

కొద్ది రోజుల క్రితం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఆ ఈవెంట్‌లో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ లతో కలిసి డ్యాన్స్ చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. లైవ్ సెషన్‌లో, దాని గురించి కూడా ప్రశ్నించారు. ‘మీ కూతురు పెళ్లిలో డ్యాన్స్ చేయని నువ్వు అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఎందుకు డ్యాన్స్ చేశావు’ అని నెటిజన్లు ప్రశ్నించారు. దానికి ఆయన నా కూతురి పెళ్లిలో కూడా డ్యాన్స్ చేశాను’ అంటూ నవ్వేశాడు అమీర్ ఖాన్. ‘ముఖేష్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను అతని ఫంక్షన్‌లో డ్యాన్స్ చేశాను. ముఖేష్, నీత వారి పిల్లలు మా కుటుంబం లాంటివారు. అతని వేడుకలో నేను డాన్స్ చేస్తాను. మా ఫంక్షన్‌లో డ్యాన్స్‌ చేస్తానని అమీర్‌ఖాన్‌ బదులిచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us