Sirivennela Sitarama Sastri: సాహిత్య లోకానికి చీకటి రోజు.. తీవ్ర భావోద్వేగానికి గురైన చిరంజీవి..

|

Nov 30, 2021 | 9:41 PM

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి పట్ల మెగా స్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సికింద్రాబాద్ కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి.. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు....

Sirivennela Sitarama Sastri: సాహిత్య లోకానికి చీకటి రోజు.. తీవ్ర భావోద్వేగానికి గురైన చిరంజీవి..
Chiranjeevi
Follow us on

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి పట్ల మెగా స్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సికింద్రాబాద్ కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి.. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ రోజు సాహిత్యానికి చీకటి రోజని చిరంజీవి అన్నారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

మెగాస్టార్ సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విచారం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మరణంతో తన గుండె తరుక్కుపోతోందని, బరువెక్కిపోతోందని చిరు అన్నారు. తెలుగు సినీపరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీచేయలేరని చెప్పారు. ఎంతో మందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహిత్య లోకానికి అన్యాయం చేశారని చెప్పారు.

భౌతికంగా సిరివెన్నెల దూరమైన కానీ తన పాటలతో ఇంకా ఆయన బతికే ఉన్నారని వెల్లడించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆరు రోజుల క్రితం ఆస్పత్రిలో జాయిన అయినప్పుడు తను ఆయన మాట్లాడనని చిరు చెప్పారు.

Read Also..  Sirivennela Sitarama Sastri: ఆయన మరణం నన్నెంతగానో బాధించింది.. సిరివెన్నెల మృతిపై స్పందించిన ప్రధాని మోడీ..