Malaika Arora: వేలి ఉంగరం చూపిస్తూ.. మళ్ళీ వార్తల్లో నిలిచిన ఐటెం భామ మలైకా అరోరా..

|

Apr 14, 2021 | 1:07 PM

Malaika Arora: నటి, మోడల్, నృత్య కళాకారిణి, టివి వ్యాఖ్యాత. ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్రవేసింది మలైకా అరోరా.. అయితే ఆమె సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతో బాగా ఫేమస్‌...

Malaika Arora: వేలి ఉంగరం చూపిస్తూ.. మళ్ళీ వార్తల్లో నిలిచిన ఐటెం భామ మలైకా అరోరా..
Malaika Arora
Follow us on

Malaika Arora: నటి, మోడల్, నృత్య కళాకారిణి, టివి వ్యాఖ్యాత. ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్రవేసింది మలైకా అరోరా.. అయితే ఆమె సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతో బాగా ఫేమస్‌ అయ్యింది. మొదట బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు అర్భాజ్‌ ఖాన్‌తో విడాకులు, ఆ తర్వాత యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌ వంటి విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది మలైకా అరోరా. ఇప్పుడు మరోసారి మలైకా పేరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన ఓ పోస్ట్..

తాజాగా మలైకా అరోరా తన వెలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ. ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో గత కొంతకాలంగా మలైకా అరోరా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తుంది అన్న వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని అంటూ బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ మాజీ భార్య మలైకా అరోరా. వీరిద్దటూరు ఓ యాడ్ సమయంలో పరిచయం ప్రేమగా మారింది. 1998లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 18 ఏళ్ల వీళ్ళ లైఫ్ జర్నీకి గుడ్ బై చెప్పి విడాకులు తీసుకున్నారు.
విడాకులు ఇచ్చిన కొంతకాలానికే మళ్ళీ తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్ ప్రేమలో పడింది. తాను అర్జున్‌- తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు స్వయంగా ప్రకటించింది. వీరిద్దరూ కలిసి పలు పార్టీలకు వెళ్లి కెమెరాలు చిక్కి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

Also Read: వాటే ఐడియా సర్జీ.. రైలుబోగీలా బైక్ కి ట్రాలీ తగిలించి ఏకకాలంలో పదిమంది ప్రయాణం.. వీడియో వైరల్