సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంటే అంత సులువు కాదు. అందం అభినయం ఉన్నా అదృష్టం కూడా ఉండాలి. ఒకవేళ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దాని కంటిన్యూ చేయాలి. కొత్త అందాలు నిత్యం పలకరిస్తున్న ఈ సమయంలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కొంచం కష్టమే.. భాషతో సంబంధం లేకుండా తమ నటనతో చాలా మంది హీరోయిన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే హీరోయిన్స్ ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు అంటుంది ఓ క్రేజీ హీరోయిన్. ఆమె ఎవరో కాదు పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్. సినీ ఇండస్ట్రీలోకి వెళ్తే అమ్మాయిలు చెడిపోతారు అనే చెడు అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకే చాలా మందిని ఇండస్ట్రీలోకి పంపడానికి తల్లిదండ్రులు వెనకడుతూ ఉంటారు.
తాజాగా కృతి సనన్ ఇదే విషయం పై స్పందిస్తూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ మాట్లాడుతూ.. హీరోయిన్ గా చేయడం అనేది ఒక ఉద్యోగంగా ఎవరూ చూడరు అని తెలిపింది కృతి.
సినిమా ఇండస్ట్రీలో నటిగా పని చేయడం ఒక వృత్తిగా చూడరు. అందుకే హీరోయిన్స్ ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకే అంత త్వరగా హీరోయిన్స్ కు పెళ్లిళ్లు కావు అని చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా మంది తనని కూడా ఇలాగే భయపెట్టారు. అయితే ఆ విషయాలని తాను సీరియస్ గా తీసుకోలేదు అని తెలిపింది కృతి. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది.