ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో నయా ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేస్తే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువేతేవి.. కానీ మారుతున్న కాలంలో హీరోయిన్స్ స్కిన్ షోను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పుడు హీరోలు రంగంలోకి దిగారు. మొన్నటివరకు షార్ట్ మాత్రమే విప్పేసిన హీరోలు.. ఇప్పుడు ప్యాంట్ కూడా తీసేస్తున్నారు. న్యూడ్ ఫోటోషూట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు సినిమాకోసం న్యూడ్ స్టిల్స్ దిగిన హీరోలు.. ఇప్పుడు ఏకంగా ఫోటో షూట్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) ఇటీవల న్యూడ్ ఫోటో షూట్‌తో రచ్చ లేపాడు.. దాంతో ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ జరుగుతోంది. చాలా మంది రణవీర్ ఫోటోల పై స్పందించారు. తాజాగా స్టార్ హీరోయిన్ కరీనాకపూర్(Kareena Kapoor) కూడా ఈ ఫోటోల పై స్పందించింది.
కరీనా కపూర్ ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా సినిమాలో నటిస్తుంది. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్నారు అమీర్ అండ్ కరీనా. ఈ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. అమీర్ ఖాన్ కరీనా కపూర్ ఇద్దరు తమ వ్యక్తిగత విషయాలను కూడా ఈ షోలో పంచుకున్నారు. అయితే రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోస్ పై మీ స్పందన ఏంటి అని కరీనాను అడిగాడు కరణ్. దానికి న్యూడ్ ఫొటోస్ లో తప్పేముంది అంటూ రణ్వీర్ కు మద్దతుగా మాట్లాడారు. వివాదాస్పదం చేయాల్సినంతగా ఆ ఫొటోస్ లో ఏముంది అన్నట్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇంకా ఆ ఫొటోస్ చూడలేదు. లాల్ సింగ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నా అంటూ సమాధానమిచ్చారు.