అందాల ఇలియానా(Ileana) ఒకానొక సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఇలియానా. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. దేవదాస్ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే ఇలియానా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ దక్కించుకుంది ఇలియానా .. తెలుగుతో పటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది.అలాగే బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ సన్నజాజి. అయితే సౌత్ లో కెరీర్ మంచి పీక్ లో ఉండగానే బాలీవుడ్ వైపు అడుగులేసింది. ఆ తర్వాత ఇక్కడ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఇక బాలీవుడ్ కు వెళ్లిన సమయంలో ఇలియానా ప్రేమలో కూడా పడింది.
ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో పడింది ఈ చిన్నది. కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి ప్రేమ ప్రయాణం ఆ తర్వాత బ్రేకప్ కు దారితీసింది. ప్రియుడితో విడిపోయిన తర్వాత ఇలియానా డిప్రషన్ లోకి వెళ్ళింది. అదే సమయంలో బరువు కూడా పెరిగింది. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టాలనుకున్నా సక్సెస్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మరోసారి ప్రేమలో పడిందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా రిలేషన్ షిప్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోకు హాజరయ్యింది కత్రినా కైఫ్.. ఆ టైంలో ఇలియానాతో మీ సోదరుడు సెబాస్టియన్ రిలేషన్ లో ఉన్నారంటగా అని ప్రశ్నించగా.. కత్రినా దాన్ని ఖండించలేదు. అలా అని కన్ఫామ్ కూడా చేయలేదు. దాంతో ఇలియానా , సెబాస్టియన్ రిలేషన్ పై ఓ కహింట్ వచ్చింది ప్రేక్షకులకు. ఇటీవల కత్రినా కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్ మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడే కత్రినా పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. కత్రినా కుటుంబసభ్యులతో పటు.. ఇలియానా కూడా వారితో జాయిన్ అయ్యింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఇలియానా, సెబాస్టియన్ ఇద్దరు బాంద్రాలో ఓ అపార్ట్మెంట్ లో కలిసి ఉంటున్నారట. మొత్తంగా గోవా ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలు పడిందని బీ టౌన్ మొత్తం కోడై కూస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..