బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంగనా ఏం మాట్లాడిన అది సంచలనానికి దారితీస్తుంది. వివాదాలుకంగనకు కొత్తేమీ కాదు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. రాజకీయ నాయకులనుకు సైతం టార్గెట్ చేసి కామెంట్ చేశారు కంగనా. కొద్దిరోజులుగా కంగనా సైలెంట్ గా ఉంటున్నారు. లాకప్ అనే రియాలిటీ షో నిర్వహిస్తున్న బిజీగా గడుపుతోంది కంగనా.. అలాగే ఈనెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ధకడ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కంగనా గత రెండు మూడు వారాలుగా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ప్రమోషన్ చేస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర కామెట్స్ చేసింది
కంగనా మాట్లాడుతూ.. బాలీవుడ్ లో కొందరు తనను టార్గెట్ చేసి తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది. తాజాగా తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. ఓ రిపోర్టర్.. ధాకడ్ సినిమాలో మీ పాత్ర మగరాయుడిగా ఉంటుందని.. మీరు నిజ జీవితంలో అలాగే ఉంటారా అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు కంగనా జవాబిస్తూ.. మీరు ఇలాంటి పుకార్లు పుట్టించి.. నిందలు వేయడం వల్లే నాకు ఇప్పటికి పెళ్లి కావడం లేదు అంటూ కాస్త ఫన్నీగా వ్యాఖ్యలు చేసింది. నేను ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకునే ఫైర్ బ్రాండ్ అనే ముద్ర వేశారు. నేను ఒక మంచి అమ్మాయిగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటే కొందరు తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ కంగనా చెప్పుకొచ్చింది.
మరిన్ని ఇక్కడ చదవండి :