Janhvi Kapoor Auto Riksha Driving Video: ఓవైపు నటీగా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో నటి జాన్వీ కపూర్ ఒకరు. తల్లి శ్రీదేవి, తండ్రి బోణీ కపూర్‌ల నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న జాన్వీ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ వస్తోంది.
కెరీర్ తొలి నాళ్ల నుంచి ఆచితూచి పాత్రలు ఎన్నుకుంటున్న జాన్వీ.. కాస్త సమయం దొరిందంటే చాలు నెట్టింట్లో తెగ హంగామా చేస్తుంది. అప్పట్లో షూటింగ్ సెట్‌లో క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్న ఈ అందాల తార తాజాగా.. ఏకంగా ఆటో రిక్షా నడిపి ఆశ్చర్యానికి గురిచేసింది. ఏదో అటు, ఇటుగా కాకుండా పక్కా ప్రొఫెషనల్ డ్రైవర్‌గా ఆటో నడిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోతో పాటు ‘సినిమా షూటింగ్ సంతోషంతో కూడుకుని ఉంటాయి’ అని క్యాప్షన్ జోడించిందీ బ్యూటీ. ఇక జాన్వీ ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి మొదటి నుంచి వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఎన్టీఆర్ సరసన నటిస్తుంచనుంది అంటూ అప్పట్లో వార్తలు వచ్చినా.. తర్వాత అవి వట్టి పుకార్లే అని తేలింది. మరి తెలుగులో నటిగా మంచి పేరు సంపాదించుకున్న శ్రీదేవీ కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడుంటుందో వేచి చూడాలి.
Also Read: Happy Birthday Jagapathi Babu: జగ్గూభాయ్.. ఈ ఏడాదిలో ప్రతి నెలా ఒక సినిమా రిలీజ్ పక్కా..!