Adipurush: ప్రభాస్ (Prabhas) సినిమా కోసం ఇప్పుడు కేవలం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. బాహుబలితో (Bahubali) ఒక్కసారిగా నేషనల్ హీరోగా మారడంతో ప్రభాస్ క్రేజ్ ఆకాశాన్నంటింది. దీంతో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునే క్రమంలో బాలీవుడ్ మేకర్స్ ఆదిపురుష్ చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలపై చర్చ జరుగుతోంది. కరోనా కారణంగా మధ్యలో ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడతూ వచ్చింది. దీంతో విడుదల తేదీ కూడా వాయిదా పడింది.
అయితే తొలుత ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల చిత్ర యూనిట్ సినిమా తేదీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఆదిపురుష్‌ను ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర నిర్మాత భూషన్ కుమార్ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిపురుష్ సినిమా విడుదలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే దీపావళికి విడుదలువుతుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. చాలా సినిమాలు ఇప్పటికే దీపావళికి విడుదల తేదీలను ప్రకటించాయి. కాబట్టి దీపావళికి ఆదిపురుష్ రాదు అనే క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఏడాదంతా వేచి చూడాల్సిందేనా..? లేదా 2022 ముగింపులో ఆదిపురుష్ వస్తుందా చూడాలి.
ఇదిలా ఉంటే రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా. కృతీ సనన్‌గా సీతగా కనించనుంది. ఇక బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సైఫ్ అలీఖాన్ ఇందులో రావణుడి పాత్రలో కనించనున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు మేకర్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
Amritha aiyer: చీరకట్టులో తెలుగుతనం ఉట్టిపడేలా అమృత అయ్యర్… ఆకట్టుకుంటున్న ఫొటోస్…