Tollywood: ఈ స్టైలీష్ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా ?.. బాలీవుడ్ స్టార్ హీరో.. ఫ్యూచర్ డాన్..
ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పైన ఫోటో చూశారు కదా.. అతను బాలీవుడ్ స్టార్ హీరో.. అతనికి ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. అలాగే ఎన్నో బ్రాండ్ అంబాసిడర్. తను మరెవరో కాదు

ప్రస్తుతం సినీప్రియులు.. అభిమానులు తమ ఫేవరేట్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి విషయాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తమ అభిమాన నటీనటులు తమ చిన్నతనంలో ఎలా ఉండేవారో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. కొద్ది రోజులుగా సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉన్నారు. అంతేకాకుండా.. లైవ్ చిట్ చాట్ చేస్తూ ఫ్యాన్స్ తో నేరుగా ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పైన ఫోటో చూశారు కదా.. అతను బాలీవుడ్ స్టార్ హీరో.. అతనికి ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. అలాగే ఎన్నో బ్రాండ్ అంబాసిడర్. ఎవరో గుర్తుపట్టారా ?.. తను మరెవరో కాదు బీటౌన్ హీరో రణవీర్ సింగ్. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంది అభిమానులు ఉన్న హీరో. ఇప్పుడు డాన్ 3 సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన చిన్ననాటి ఫోటోస్ కొన్ని నెట్టింట వైరలవుతున్నాయి.
బాలీవుడ్‌లో ‘డాన్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ ఇప్పటికే ఈ సినిమాలలో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు ప్రేక్షకులు డాన్ 3 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి నుంచి డాన్ 3లో షారుఖ్ నటిస్తున్నట్లుగా సమాచారం. కానీ అనుకోకుండా అతని స్థానంలోకి రణవీర్ సింగ్ చేరారు. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఇప్పటికే ‘డాన్ 3′ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. దీంతో వెంటనే రణవీర్ సింగ్ చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ తన తన సంతోషాన్ని పంచుకున్నాడు.
అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌ల పోషించిన పాత్రను మరొక నటుడు కొనసాగించడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది చాలా పెద్ద బాధ్యత. దానిని సమర్ధవంతంగా నిర్వహిస్తానని రణవీర్ సింగ్ హామీ ఇచ్చాడు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ గర్వపడేలా నటిస్తానని.. తనపై నమ్మకం ఉంచి ఈ పాత్ర ఇచ్చినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు రణ్వీర్. ఇటీవల ఆయన నటించిన ’83’, ‘జయేష్‌భాయ్ జోర్దార్’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు రణ్వీర్ సింగ్ ఆశలన్నీ డాన్ 3 సినిమాపైనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.